భువనగిరిలో హైడ్రామా! | - | Sakshi
Sakshi News home page

భువనగిరిలో హైడ్రామా!

Feb 14 2026 8:01 AM | Updated on Feb 14 2026 8:01 AM

భువనగ

భువనగిరిలో హైడ్రామా!

భువనగిరిలో హైడ్రామా!

– 10,11లోu

మరిన్ని వార్తలు, ఫొటోలు

భువనగిరి : జనగామ మున్సిపాలిటీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులు కింగ్‌ మేకర్స్‌గా మారారు. 23వ వార్డునుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన భూష పర్వతాలును కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులు కారులో ఎక్కించుకుని హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో భువనగిరి బైపాస్‌ రోడ్డులోని ఓ హోటల్‌ వద్ద ఆగగా, ఆ అభ్యర్థి.. బీఆర్‌ఎస్‌ నాయకులకు సమాచారం అందడంతో వెంటనే జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. పార్టీ నాయకులతో కలిసి భువనగిరికి చేరుకున్నారు. తమకు మద్దతు తెలిపే అభ్యర్థిని అప్పగించాలని కాంగ్రెస్‌ నాయకులను కోరారు. అప్పటికే హోటల్‌కు వద్దకు చేరుకున్న ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఒకరు.. అభ్యర్థితో ఉండడంతో ఎమ్మెల్యే పల్లా స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హోటల్‌ వద్దకు చేరుకోగా, పల్లా వారితో మాట్లాడి తమకు మద్దతు తెలిపే అభ్యర్థిని బలవంతంగా తీసుకెళ్తున్నారని చెప్పారు. పోలీసులు సదరు అభ్యర్థిని ఎవరికి మద్దతు ఇస్తారని అని అడగ్గా బీఆర్‌ఎస్‌కు అని చెప్పడంతో అతన్ని ఎమ్మెల్యే పల్లాకు అప్పగించగా ఆయన వెంటబెట్టుకుని తీసుకెళ్లారు.

భువనగిరిలో హైడ్రామా!
1
1/1

భువనగిరిలో హైడ్రామా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement