కాంగ్రెస్‌ వెంటే ఘన్‌పూర్‌ ప్రజలు | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ వెంటే ఘన్‌పూర్‌ ప్రజలు

Feb 14 2026 8:01 AM | Updated on Feb 14 2026 8:01 AM

కాంగ్

కాంగ్రెస్‌ వెంటే ఘన్‌పూర్‌ ప్రజలు

ఎమ్మెల్యే కడియం శ్రీహరి

స్టేషన్‌ఘన్‌పూర్‌: ఘన్‌పూర్‌ మున్సిపాలిటీ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ వెంట, తన వెంట ఉన్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కౌన్సిలర్లుగా గెలుపొందిన పార్టీ అభ్యర్థులతో కలిసి శుక్రవారం ఆయన స్థానిక కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు.. ముందుగా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ నాయకులతో కలిసి ఆయన సంబురాల్లో పాల్గొని పార్టీ శ్రేణుల్లో జోష్‌నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన స్టేషన్‌ఘన్‌పూర్‌ మున్సిపాలిటీ మొట్టమొదటి కౌన్సిలర్లుగా మెజార్టీ స్థానాల్లో గెలిచి కాంగ్రెస్‌ పార్టీ చరిత్ర సృష్టించిందన్నారు. మున్సిపాలిటీలో 70 శాతానికి పైగా సీట్లను గెల్చుకున్నామని, ప్రతిపక్ష పార్టీలకు ప్రజలు తమ ఓట్లతో బుద్ధి చెప్పారన్నారు. పనిలేని ప్రతిపక్ష పార్టీల విమర్శలు పట్టించుకోనన్నారు. కాంగ్రెస్‌ పార్టీపై, సీఎం రేవంత్‌రెడ్డిపై, ఎమ్మెల్యేగా తనపై ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని, అందరూ బాధ్యతగా పనిచేస్తూ మున్సిపాలిటినీ ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేయాలన్నారు. విజయం అందించిన ప్రజలకు, కాంగ్రెస్‌ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాంబాబు, జగదీష్‌చందర్‌రెడ్డి, సతీష్‌ పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ వెంటే ఘన్‌పూర్‌ ప్రజలు 1
1/1

కాంగ్రెస్‌ వెంటే ఘన్‌పూర్‌ ప్రజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement