సమాన ఓట్లు వస్తే లాటరీ!
జనగామ: జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ఇరు పార్టీలకు సమాన ఓట్లు పడే అవకాశం ఉండడంతో లాటరీ ద్వారా పురపాలిక చైర్మన్‌న్ ఎన్నుకునే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వెల్లడించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఇరు పార్టీల అంగీకారంతో ఈ ప్రక్రియ నిర్వహించబడనుందని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సూచించిన చైర్మన్ అభ్యర్థుల పేర్లను ఒక్కొక్కరికి ఐదు చీటీల రూపంలో సిద్ధం చేసి, ప్రత్యేకంగా ఏర్పా టు చేసిన ఓ డబ్బాలో వేసి, వీడియో సర్వైలెన్స్ పర్యవేక్షణలో అందరి సాక్షిగా లాటరీ తీస్తారు. చీటీలో రెండు పార్టీలు కోరంతో సమావేశానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నందున నేడే లాటరీ జరగవచ్చు. అయితే, ఏదైనా పార్టీ సమావేశానికి రాలేని పక్షంలో కోరం లేని సమయంలో ప్రక్రియ వాయిదా పడే అవకాశం ఉంది.
నేటి ప్రజావాణి రద్దు
జనగామ రూరల్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సోమవారం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికతో పాటు ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో కలెక్టరేట్‌లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్నందున ప్రజలు గమనించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ‘స్టేషన్’ విప్‌గా
సంపత్‌రాజ్
స్టేషన్‌ఘన్‌పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ విప్‌గా 9వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికై న సౌదరపెల్లి సంపత్‌రాజ్‌ను నియమించినట్లు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ఈ మేరకు హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో సంపత్‌రాజ్‌కు విప్‌గా నియమిస్తూ నియామక పత్రాన్ని అందించారు. స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఛాగల్లులోని 9వ వార్డుకు చెందిన సంపత్‌రాజ్‌ను విప్‌గా నియమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ వర్సిటీ టోర్నమెంట్‌కు కేయూ జట్టు
కేయూ క్యాంపస్: రొహతక్‌లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీలో ఈనెల 15న ప్రారంభమైన ఆల్‌ఇండియా ఇంటర్ యూనివర్సిటీ క్రాస్‌క్రంటీ టోర్నమెంట్‌కు కాకతీయ యూనివర్సిటీ క్రాస్‌కంట్రీ పురుషుల జట్టును స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ వై.వెంకయ్య ప్రకటించారు. జె.రాఘవ, జె.రిషిక్, ఎం.అఖిల్, జె.అనిల్, జి.శివకుమార్, ఎండీ హబీబుద్దీన్ జట్టులో ఉన్నారని ఆయన తెలిపారు. ఈజట్టుకు కాకతీయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కె.శ్రీధర్‌కుమార్ కోచ్ కం మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
సమాన ఓట్లు వస్తే లాటరీ!


