కమనీయం..శివకల్యాణం
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో ఆదివారం రాత్రివేద పండితుడు తాటిపాముల నరసింహమూర్తి శర్మ నేతృత్వంలో శివ పార్వతుల కల్యాణం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు, తలబ్రాలు తీసుకొచ్చారు. 107 జంటలు కల్యాణంలో పాల్గొన్నాయి. ఈఓ భాగం లక్ష్మీప్రసన్న, ఆర్చకులు,భక్తులు పాల్గొన్నారు.
సిద్ధులగుట్టలో..
బచ్చన్నపేట: మండలంలోని కొడవటూరు సిద్ధేశ్వరాలయంలో వీరశైవ సాంప్రదాయం ప్రకారం ఆలయ ప్రధాన అర్చకుడు ఓం నమఃశివాయ మంత్రోచ్ఛరణల నడుమ ఆదివారం రాత్రి 9 గంటలకు శివపార్వతుల కల్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా జరిపించారు. గ్రామ సర్పంచ్ నీల కవితమురళి, ఈఓ వంశీ స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. కల్యాణ తంతు అనంతరం మహిళలు అమ్మవారికి ఓడిబియ్యం పోసి, కానుకలు సమర్పించుకున్నారు. కొడవటూర్, బచ్చన్నపేట ఒగ్గు కళాకారులు విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కల్యాణ మహోత్సవం ముగిసిన అనంతరం శివపార్వతుల దేవతామూర్తులతో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నూకల బాల్‌రెడ్డి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మల్లారెడ్డి, సర్పంచ్‌లు ఆరె రవికుమార్, నల్ల సిద్దినర్సమ్మ, ఇ జ్జగిరి రాములు, అర్చకుతు, సిబ్బంది, పలువురు పాల్గొన్నారు. నర్మెట సీఐ అబ్బయ్య పర్యవేక్షణలో ఎస్సై ఎస్‌కే హమీద్ బందోబస్తు నిర్వహించారు.
కమనీయం..శివకల్యాణం
కమనీయం..శివకల్యాణం


