సంక్షేమ పథకాలు అందరికీ అందాలి
● ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
బచ్చన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందరికి అందాలన్నదే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. ఆదివారం మండలంలోని కొడవటూర్ గ్రామంలోని శ్రీ సిద్ధేశ్వరాలయంలో మహాశివరాత్రి పర్వదినం, బ్రహ్మోత్సవాల సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సిద్ధేశ్వరాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ చిందం వంశీ, ఆలయ ప్రదాన పూజారి ఓం నమశివాయ, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ఆముదాల మల్లారెడ్డి, సీపీఐ చేర్యాల మండల కార్యదర్శి జంగిలి యాదగిరి, ఆలయ సిబ్బంది లక్ష్మికాంత్‌రెడ్డి, శ్రీనివాస్, బానుప్రకాష్‌రెడ్డి, గుర్రపు బాల్‌రాజు, జిల్లా సందీప్, జంగిడి సిద్దులు తదితరులు పాల్గొన్నారు.


