పోర్టల్‌లో వివరాల నమోదు.. | - | Sakshi
Sakshi News home page

పోర్టల్‌లో వివరాల నమోదు..

Feb 20 2026 6:40 AM | Updated on Feb 20 2026 6:40 AM

పోర్టల్‌లో వివరాల నమోదు..

పోర్టల్‌లో వివరాల నమోదు..

పోర్టల్‌లో వివరాల నమోదు..

జనగామ వ్యవసాయ మార్కెట్‌లో ఈ నెల 23 నుంచి అన్ని వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు ప్రభుత్వం ఆధునికీకరించిన ఈ నామ్‌ 2.0 పోర్టల్‌ ద్వారా మాత్రమే నిర్వహిస్తారు. ఇప్పటివరకు ఉపయోగించిన ఈ నామ్‌ 1.0 వ్యవస్థకు బదులుగా కొత్త సౌకర్యాలు, ఆధునిక పద్ధతులు అమల్లోకి రానున్నాయి. రైతులు తప్పనిసరిగా ఈ నామ్‌ 2.0 పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. నమోదు అనంతరం రైతుకు ఒక ప్రత్యేక యూనిక్‌ ఐడీ కేటాయిస్తారు. ఈ ప్రత్యేక నంబర్‌తోనే దేశంలోని ఏ మార్కెట్‌లోనైనా రైతుల వివరాల ఆధారంగా అమ్మకాలు సాగుతాయి. యూనిక్‌ ఐడీ పొందిన రైతుల ఉత్పత్తులకే మార్కెట్‌లో లావాదేవీలకు అనుమతి ఉంటుంది. ఆడ్తి, ఖరీదు వ్యాపారులు ఈ నెల 21వ తేదీ లోపు ఈనామ్‌ 2.0లో తప్పనిసరిగా వివరాలు నమోదు చేసుకోవాలి. నమోదు సమయంలో లైసెన్స్‌ వివరాలు, ఫోన్‌ నంబర్‌, ఫొటో, నోడ్యూ సర్టిఫికెట్‌ అప్‌లోడ్‌ చేయాలి. అప్రూవల్‌ పొందిన వ్యాపారుల వివరాలు మాత్రమే ఈ–నామ్‌ 2.0లో కనిపిస్తాయి. వారికే వ్యాపారానికి అనుమతి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement