సనాతన పరిరక్షకుడు శివాజీ | - | Sakshi
Sakshi News home page

సనాతన పరిరక్షకుడు శివాజీ

Feb 20 2026 6:40 AM | Updated on Feb 20 2026 6:40 AM

సనాతన పరిరక్షకుడు శివాజీ

సనాతన పరిరక్షకుడు శివాజీ

కనుల పండువగా ఛత్రపతి జయంతి – మరిన్ని ఫొటోలు 9లోu

కనుల పండువగా ఛత్రపతి జయంతి

జనగామ: సనాతన ధర్మపరిరక్షకుడు ఛత్రపతి శివాజీ అని వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్‌, బజరంగ్‌ దళ్‌, బీజేపీ నాయకులు కొనియాడారు. శుక్రవారం రాత్రి పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ 396వ జయంతిని పురస్కరించుకొని శివాజీ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ముక్క కుమారస్వామి, జిల్లా నాయకుడు బానోత్‌ అర్జున్‌ పిలుపు మేరకు రైల్వే స్టేషన్‌ నుంచి కాషాయ జెండాలతో భారీ ర్యాలీ ప్రారంభమైంది. ట్రాక్టర్‌పై శివాజీ మహారాజ్‌ విగ్రహం, ఆటోల్లో మైక్‌ సిస్టమ్‌తో ఊరేగింపు సాగింది. వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్‌, బజరంగ్‌ దళ్‌, బీజేపీ కార్యకర్తలతో సహా వందలాది మంది హిందువులు పాల్గొనగా, పట్టణమంతా కాషాయమయంగా మారింది. రైల్వే స్టేషన్‌ నుంచి నెహ్రూ పార్క్‌ మీదుగా ఆర్టీసీ చౌరస్తా, అనంతరం సూర్యాపేట రోడ్డులోని శివాజీ విగ్రహం వద్దకు ర్యాలీ చేరింది. సీఐ సత్యనారాయణరెడ్డి పర్యవేక్షణలో ఎస్సైలు చెన్నకేశవులు, భరత్‌ బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఆరుట్ల దశమంతరెడ్డి, దొంతుల శేఖర్‌, కొంతం శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

శివాజీ శోభాయాత్రలో పాల్గొన్న విశ్వహిందూ పరిషత్‌,

బజరంగ్‌దళ్‌, బీజేపీ శ్రేణులు

ఈ–నామ్‌ మరింత ఫాస్ట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement