భద్రకాళి అమ్మవారికి చీర బహూకరణ | - | Sakshi
Sakshi News home page

భద్రకాళి అమ్మవారికి చీర బహూకరణ

Feb 20 2026 6:40 AM | Updated on Feb 20 2026 6:40 AM

భద్రక

భద్రకాళి అమ్మవారికి చీర బహూకరణ

హన్మకొండ కల్చరల్‌: వరంగల్‌ నగరంలోని శ్రీభద్రకాళి అమ్మవారికి గురువారం వేదుమ ఫ్యాబ్రిక్‌ హౌజ్‌ తయారుచేసిన కస్టమైజ్డ్‌ ఆర్ట్‌ డిజైన్‌ చీరను బహూకరించారు. చీరపై హ్యాండ్‌ ఆర్ట్‌తో అమ్మవారి ప్రతిరూపాన్ని అందంగా ప్రతిబింబించారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించి సంస్థ యజమానులు ఓరుగంటి కార్తీక్‌, మోర రవళి అందజేసిన చీరను అమ్మవారికి అలంకరించారు.

సేవాలాల్‌ జయంతి ఉత్సవాలను చేపట్టాలి

స్టేషన్‌ఘన్‌పూర్‌: ఈనెల 24న ఘన్‌పూర్‌ డివిజన్‌ కేంద్రంలో నిర్వహించనున్న గిరిజనుల ఆరాధ్యదైవం సంత్‌సేవాలాల్‌ జయంత్యోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఘన్‌పూర్‌ ఆర్‌డీఓ డీఎస్‌ వెంకన్న సూచించారు. సంత్‌సేవాలాల్‌ జయంతి నియోజకవర్గ స్థాయి ఉత్సవాల నిర్వహణపై స్థానిక ఆర్‌డీఓ కార్యాలయంలో జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి ఆర్‌.ప్రేమలత, బంజారా కమిటీ సభ్యులతో గురువారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక పద్మావతి ఫంక్షన్‌హాల్‌లో ఉత్సవాలను చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సహాయ గిరిజనాభివృద్ధి అధికారి హసీనాబేగం, ట్రైనీ జిల్లా పంచాయతీ అధికారి ఎ.నవీన్‌, తహసీల్దార్లు వెంకటేశ్వర్లు, రవీందర్‌, సదానందం, విజయ్‌కుమార్‌, భిక్షపతినాయక్‌, స్వామినాయక్‌, కొమురెల్లినాయక్‌, హుస్సేన్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

మద్యపాన నిషేధం కోసం సామూహిక సంతకాలు

దేవరుప్పుల: మండలంలోని బంజర గ్రామంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలని గ్రామస్తులు సామూహిక సంతకాలు సేకరించారు. స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు సర్పంచ్‌ ధరావత్‌ చిరంజీవి, ఉపసర్పంచ్‌ జోగు నాగయ్య, వార్డు సభ్యులు కలిసి ఎకై ్సజ్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌కు పంచాయతీ పాలకవర్గం పక్షాన వినతి పత్రం అందించారు. ఈ విషయమై సర్పంచ్‌ మాట్లాడుతూ.. గ్రామస్తుల సామూహిక సంతకాల సేకరణతో మద్యపాన నిషేధం కోసం కీలక నిర్ణయం తీసుకున్నామన్నారు.

సిబ్బందిని మారిస్తేనే

అనుమతుల ప్రక్రియలో వేగం

జనగామ: పాఠశాల విద్యాశాఖ నుంచి జిల్లా విద్యాధికారులు ప్రాంతీయ సంయుక్త డైరెక్టర్ల(ఆర్‌జేడీఎస్‌ఈ)కు ముఖ్యమైన సూచనలు జారీ చేశారు. ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల స్థాపన, గుర్తింపు, పునరుద్ధరణ, సీబీఎసీ, ఐసీఎస్‌ఈ, ఐబీ తదితర బోర్డులకు అనుబంధం కోసం ఇచ్చే ఎన్‌ఓసీలను నిర్ణీత సమయంలో ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే పరిశీలించి ఫార్వర్డ్‌ చేయాలని, ఇప్పటికే సూచనలు ఇచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ (ఐఏఎస్‌) అందులో పేర్కొన్నారు. ఈ ఆదేశాలు ఉన్నప్పటికీ డీఈఓ, ఆర్‌జేడీఎస్‌ఈ కార్యాలయాల్లో జూనియర్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, సూపరింటెండెంట్‌ స్థాయిల్లో ఫైళ్ల పరిశీలనలో అనవసరమైన ఆలస్యం జరుగుతోందని ఆక్షేపించారు. ఒకే సిబ్బంది ప్రైవేట్‌ పాఠశాలల విభాగాన్ని నిరంతరం ఒక సంవత్సరానికి పైగా చూస్తుండడంతో ఆలస్యం పెరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్‌ పాఠశాలల విభాగంలో ఒక సంవత్సరానికి పైగా పనిచేస్తున్న జూనియర్‌ అసిస్టెంట్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లను వెంటనే మార్పు చేయాలని ఆదేశించారు.

భద్రకాళి అమ్మవారికి                      చీర బహూకరణ1
1/2

భద్రకాళి అమ్మవారికి చీర బహూకరణ

భద్రకాళి అమ్మవారికి                      చీర బహూకరణ2
2/2

భద్రకాళి అమ్మవారికి చీర బహూకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement