కందుల ధర కిందికి
ధర పెంచాలని అడిగినం..
ధర పెంచితే బాగుండు..
జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్‌లో కందుల కొనుగోళ్లు జోరుగా జరుగుతున్నప్పటికీ ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాతో పాటు సూర్యాపేట, యాదాద్రి భు వనగిరి, పరిసర ప్రాంతాల నుంచి భారీగా కందులను ఇక్కడి మార్కెట్‌కు తీసుకొస్తున్నారు. ఇటీవల క్వింటాల్ కందుల ధర రూ.8,200 నుంచి 8,400 వరకు ఉండగా, ప్రస్తుతం ఒక్కసారిగా రూ.7,400 పడిపోవడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
223 క్వింటాళ్ల కందుల కొనుగోళ్లు
మార్కెట్ ఆశించిన మేర ట్రేడర్లు రాకపోవడంతో కొ నుగోళ్ల భారం కేవలం ఇద్దరు, ముగ్గురు వ్యాపారులపైనే పడుతోంది. దీంతో పోటీ తగ్గి ధరలు మరింతగా పడిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. గురువారం మార్కెట్‌లో 54 మంది రైతుల నుంచి 223 క్వింటాళ్ల (372 బ్యాగులు) కందులు కొనుగోలు చేశారు. రోజువారీ ధరల వివరాల ప్రకారం, అత్యధికంగా క్వింటాకు రూ.7,825, మధ్యరకంగా రూ.7,429, అత్యల్పంగా రూ.7,419 మాత్రమే పలికింది.
తగ్గిన ధరలు..
ఇప్పటికే పంట దిగుబడి ఆశించినంతగా రాకపోగా, క్వింటాకు రూ.600 నుంచి రూ.900 మేర ధర తగ్గిపోవడం రైతులకు మరింత నష్టం కలిగిస్తోంది. కందులతో పాటు వేరుశనగ కూడా మార్కెటుకు వస్తున్నప్పటికీ, ధరల్లో పెద్ద మార్పు కనిపించడం లేదు. కందుల ధర మరింత పడిపోకుండా అధికారులు జోక్యం చేసుకొని కనీసం రూ.8,400 వరకు ధర నిలబెట్టేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మార్కెట్‌కు వచ్చే ట్రేడర్ల సంఖ్య పెరిగితే ధర కూడా మెరుగయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. సమీప జిల్లాల్లో కందులకు ఎక్కువ ధర పలుకుతున్నప్పటికీ జనగామ మార్కెట్‌లో మాత్రం తక్కువ ధర రావడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.
క్వింటాల్‌కు ధర రూ.600 నుంచి రూ.900 మేర తగ్గుముఖం
ధర అత్యధికం రూ.7,429,
అత్యల్పం రూ.7,419
ట్రేడర్లు తక్కువ.. సరుకు రాక ఎక్కువ
రెండుమూడు రోజుల క్రితం మార్కెట్‌లో కందులకు రూ.8 వేల వరకు ధర పలికింది. ఇప్పుడేమో క్వింటాల్‌కు రూ.600 తగ్గించారు. రెండున్నర ఎకరాల్లో కందులు సాగు చేస్తే, రూ.6వేల పెట్టుబడి కాగా, ఏడు క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ధర తక్కువైనా మార్కెట్‌లోనే అమ్ముకున్నా.
– జూకంటి జమాల్, రైతు, కుర్రారం,
రాజపేట మండలం, యాదాద్రి
ఒక ఎకరం 30 గుంటల్లో కందులు సాగు చేసిన. పెట్టుబడి ఖర్చు సుమారు రూ.5వేల వరకు వచ్చింది. 6 క్వింటాళ్లకుపైగా దిగుబడి వస్తుందనుకుంటే 4 క్వింటాళ్ల మాత్రమే వచ్చింది. అమ్ముకునేందుకు జనగామ మార్కెట్‌కు తీసుకొస్తే క్వింటాల్‌కు రూ.7,399 మాత్రమే ధర పలికింది. క్వింటాల్‌కు కనీసం రూ.8వేలు వచ్చినా బాగుండు.
– ఐలేని రాములు, రైతు, శాతపురం, పాలకుర్తి
కందుల ధర కిందికి
కందుల ధర కిందికి
కందుల ధర కిందికి


