రాష్ట్రస్థాయిలో టాప్‌లో నిలవాలి | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయిలో టాప్‌లో నిలవాలి

Feb 20 2026 6:40 AM | Updated on Feb 20 2026 6:40 AM

రాష్ట్రస్థాయిలో టాప్‌లో నిలవాలి

రాష్ట్రస్థాయిలో టాప్‌లో నిలవాలి

జనగామ రూరల్‌: రానున్న పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లాలో టాప్‌లో నిలవాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ప్రధాన సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారి పింకేశ్‌ కుమార్‌తో కలిసి ఆయన శ్రీవిజయోస్తు 2.0శ్రీపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ..విజయోస్తు 2.0లో భాగంగా జిల్లాలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే ప్రతీ విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా పాఠశాల స్థాయిలో సమగ్ర యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించి అమలుచేయాలని ఆదేశించారు. ప్రీ ఫైనల్‌, మాక్‌ టెస్ట్‌ల ఫలితాల ఆధారంగా విద్యార్థులను స్థాయివారీగా వర్గీకరించి బోధన నిర్వహించాలన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక రిమీడియల్‌ తరగతులు నిర్వహించాలని, ఉపాధ్యాయుడు కొంతమంది విద్యార్థులను దత్తత చేసుకొని వ్యక్తిగత పర్యవేక్షణ చేయాలన్నారు. సమావేశంలో ఏఎంఓ శ్రీనివాస్‌, జీసీడీఓ గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు.

పథకాలు సమర్థవంతంగా అమలు చేయాలి

జిల్లాలో వ్యవసాయరంగ అభివృద్ధి, ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ..వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద జిల్లాకు కేటాయించిన నిధులను ఈ నెలాఖరులోపు అర్హులైన రైతులకు అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఫార్మర్‌ రిజిస్ట్రీ కార్యక్రమంలో ప్రస్తుతం 60శాతం మాత్రమే పూర్తి అయిందని మిగిలిన రైతులు నమోదు చేసుకోవాలన్నారు.

కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌

విజయోస్తు 2.0పై సమీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement