కడియం ఖబడ్దార్
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ: కేసీఆర్‌పై స్టేషన్ ఘన్‌ఫూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమైనవని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఖండించారు. గురువారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. కడియం శ్రీహరి అంటే మోసానికి పర్యాయపదమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో దశాబ్దాలుగా ప్రజలను, నాయకులను మోసం చేస్తూ వస్తున్న వ్యక్తి అని ఆరోపించారు. కాంగ్రెస్ సభలో చేరిన శ్రీహరి గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ వంటి ప్రముఖులను వదిలి తిరుగుతూ రాజకీయ లాభాలు పొందిన ఊసరవెల్లి అంటూ విమర్శించారు. శ్రీహరికి రాజకీయ పునర్జీవనం కల్పించింది కేసీఆర్ అని, ఎంపీ, ఎమ్మెల్సీ, మంత్రి, ఎమ్మెల్యే పదవులు మాత్రమే కాక, ఆయన కుమార్తెకు కూడా ఎంపీ టికెట్ ఇచ్చి గౌరవించినప్పటికీ, కేసీఆర్‌పై విమర్శలు చేయడం రాజకీయ నైతికత లేకపోవడమేనని వ్యాఖ్యానించారు. ప్రజలే శ్రీహరి రాజకీయ జీవితానికి ముగింపు పలుకుతారన్నారు.


