● పేరు ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం
● నేడు నామినేషన్ దాఖలు
సాక్షి, మహబూబాబాద్: రాజ్యసభ సభ్యుడిగా మహబూబాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అత్యంత సన్నిహితుడిగా పేరున్న నరేందర్‌రెడ్డి ప్రస్తుతం సీఎం ముఖ్య సలహాదారుడిగా పనిచేస్తున్నారు. ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ సభ్యుల స్థానంలో తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం లభించింది. ఏఐసీసీ కోటాలో అభిషేక్ మనుసింఘ్వీకి మరోమారు అవకాశం కల్పించగా, రాష్ట్ర కోటాలో వేం నరేందర్‌రెడ్డికి చాన్స్ ఇచ్చారు. ఈ మేరకు ఇరువురు నేడు(గురువారం) అసెంబ్లీ సెక్రటరీకి తమ నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన వద్దిరాజు రవిచంద్ర బీఆర్‌ఎస్‌నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన మరో నాయకుడికి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం దక్కడంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పేరు: వేం నరేందర్‌రెడ్డి
తల్లిదండ్రులు: కృష్ణారెడ్డి, రత్నమ్మ
భార్య: విజయ
కుమారులు: కృష్ణభార్గవ్, కృష్ణచైతన్య
గ్రామం: అర్పనపల్లి, మండలం కేసముద్రం, మహబూబాబాద్ జిల్లా
రాజకీయ అనుభవం: 2004 – 2009 వరకు మహబూబాబాద్ ఎమ్మెల్యే
ప్రస్తుతం: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ముఖ్య సలహాదారుడు


