చిన్నవేం కాదు! | - | Sakshi
Sakshi News home page

చిన్నవేం కాదు!

Feb 19 2026 10:00 AM | Updated on Feb 19 2026 10:00 AM

చిన్న

చిన్నవేం కాదు!

కొత్త పాలకమండలిదే పరిష్కార బాధ్యత కాలనీల వారీగా సమస్యలు పారదర్శక సేవల కోసం పాలనా పరంగా.. ఉల్లంఘనలపై..

వీటిపై దృష్టి సారించండి

సమస్యలు
కొత్త పాలకమండలిదే పరిష్కార బాధ్యత

జనగామ: పట్టణాభివృద్ధిపై ప్రజల్లో నెలకొన్న ఆశలు నూతన మున్సిపల్‌ పాలకవర్గం భుజాలపై మరింత బాధ్యతను పెంచుతున్నాయి. ఏళ్లుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న శానిటేషన్‌, చెత్తసేకరణ, రహదారుల దుస్థితి, డ్రెయినేజీ సమస్యలు రోజువారీగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వర్షం పడితే కాలనీలు వాగులను తలపించే పరిస్థితి నేపథ్యంలో కొత్త కమిటీపై పట్టణ ప్రజలు ఆశలు పెట్టుకుంటున్నారు.

జ్యోతినగర్‌, జీఎంఆర్‌ కాలనీ, బాలాజీ నగర్‌, హౌసింగ్‌ బోర్డు, కురుమవాడ, గిర్నిగడ్డ, గోకుల్‌ నగర్‌, బాణాపురం, ప్రెస్టన్‌ ఏరియా శ్రీహర్ష రెసిడెన్సీ, శ్రీ దుర్గా కాలనీ, అమ్మబావి వంటి ప్రాంతాల్లో చెత్త సేకరణ క్రమం తప్పడంతో పారిశుద్ధ్యం పెరిగిపోయింది. మూసుకుపోయిన డ్రెయినేజీలు, నిండిన నాళాలు ప్రజలకు మేలు చేసేదానికి మించి ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి.

తాగునీటి సరఫరాలో కలుషిత సమస్య కూడా ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతోంది. ఆయా వార్డులకు నీటి సరఫరా సమయంలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంజనీరింగ్‌, టౌన్‌ ప్లానింగ్‌ విభాగాల్లో పారదర్శకత లోపించడం, సేవల్లో ఆలస్యం ప్రజల ఆగ్రహానికి కారణమవుతోంది.

పురపాలక వ్యవస్థలో పబ్లిక్‌ సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్‌, ఈ–ఆఫీస్‌, స్టేషనరీ కొరత వంటి అంశాలు కూడా తక్షణ పరిష్కారం కావాలి. పనిచేయని సిబ్బంది మీద కఠిన చర్యలు తీసుకోవడం, పనిభారాన్ని సమానంగా పంచడం వంటి సంస్కరణలు కొత్త పాలకవర్గం కోసం ఎదురుచూస్తున్నాయి.

పట్టణంలో అక్రమ సెల్లార్లు, రోడ్లపై ఎంక్రోచ్‌మెంట్లు, అక్రమంగా ఏర్పాటు చేసిన ప్రచార బోర్డుల నియంత్రణపై కూడా చర్యలు తప్పనిసరి. మొత్తం మీద, మున్సిపల్‌ పరిపాలనను గాడిలో పెట్టి ప్రజ లకు మెరుగైన సేవలు అ ందించడంలో నూతన పాలకమండలి ఎదుర్కొనే పరీక్ష చిన్నది కాదు.

నెహ్రూపార్కు ప్రాంతంలోని 60 ఫీట్ల రహదారి అభివృద్ధి, అమ్మబావి–గిర్నిగడ్డ చిన్నమోరికి శాశ్వత పరిష్కారం, ధర్మకంచ 14వ వార్డు(అంబేడ్కర్‌ నగర్‌)తో పాటు పలు ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధి అత్యవసరం. అనేక కాలనీల్లో సీసీ రోడ్లు లేకపోవడంతో వానకాలం వచ్చేసరికి రవాణా కష్టసాధ్యమైపోతోంది.

చిన్నవేం కాదు!1
1/1

చిన్నవేం కాదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement