ఆరోగ్య భాగ్యం | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్య భాగ్యం

Feb 28 2026 7:16 AM | Updated on Feb 28 2026 7:16 AM

ఆరోగ్

ఆరోగ్య భాగ్యం

న్యూస్‌రీల్‌

– డాక్టర్‌ మల్లికార్జున్‌రావు,

జిల్లా వైద్యాధికారి

శనివారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

హైపర్‌టెన్షన్‌, మధుమేహ నియంత్రణకు తొలి అడుగు

జిల్లాలో మరో కార్యక్రమానికి శ్రీకారం

30ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరికి పరీక్షలు

గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు

ప్రత్యేక కార్యాచరణ

‘మన చైర్‌పర్సన్‌..మన వార్డు సందర్శన’ కార్యక్రమం

ప్రజా సమస్యలపై స్పెషల్‌ డ్రైవ్‌

బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్‌

చైర్‌పర్సన్‌ బాలమణి

జనగామ: జిల్లా వ్యాప్తంగా హైపర్‌టెన్షన్‌, మధుమేహం వంటి అసంక్రామ్య వ్యాధుల నియంత్రణ, ముందస్తు గుర్తింపు కోసం శ్రీఆరోగ్య జనగామ–మన ఆరోగ్యం మన చేతుల్లోశ్రీ కార్యక్రమానికి వైద్యారోగ్య శాఖ శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మల్లికార్జున్‌రావు ఆధ్వర్యంలో ప్రోగ్రాం కొనసాగుతోంది.

ఎన్సీడీల పెరుగుతున్న భారంపై ఆందోళన

రాష్ట్రంలో అసంక్రామ్య వ్యాధుల (ఎన్‌సీడీ–నాన్‌ కమ్యూనికేబుల్‌ డిసీజెస్‌) నిర్ధారణలో ఆరుగురిలో నాలుగు మరణాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా హృదయ సంబంధిత వ్యాధులు దేశంలో 29 శాతం మరణాలకు దారితీస్తుండగా, హైపర్‌టెన్షన్‌ ప్రధాన ప్రమాదకారకంగా నిలుస్తోంది. మధుమేహం 3 శాతం మరణాలకు కారణమవుతోందని ఆరోగ్యశాఖ పేర్కొంది.

కార్యక్రమ లక్ష్యాలు..

ఎన్సీడీలపై పెరుగుతున్న భారాన్ని తగ్గించడంతో పాటు నిర్ధారణ కాని హైపర్‌టెన్షన్‌, మధుమేహ కేసులను గుర్తించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. ముందస్తు నిర్ధారణతో చికిత్స, జీవనశైలిలో మార్పులు చేసుకునేలా అవగాహన కల్పిస్తారు. స్ట్రోక్‌, హార్ట్‌ డిసీజ్‌, కిడ్నీ ఫెయిల్యూర్‌ వంటి సంక్లిష్టతలను నివారించడ ంలో వైద్యులు, సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకుంటారు.

ఎవరిని లక్ష్యంగా చేసుకుంటారు..

ఆరోగ్య జనగామ కార్యక్రమంలో 30 ఏళ్లు పైబడిన ప్రతీ వ్యక్తి ఊబకాయం, కుటుంబ చరిత్ర, పొగతాగడం, మద్యపానం చేసే ప్రమాదభరిత వర్గాలను ఎంచుకుంటారు. సబ్‌సెంటర్లు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆసుపత్రిలో స్క్రీనింగ్‌తో పాటు గ్రామస్థాయిలో ఏఎన్‌ఎంలు, ఆశలు, ఎంపీడబ్ల్యూలు వైద్య శిబిరాలతో పాటు తలుపుతట్టి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. బీపీ, బ్లడ్‌ షుగర్‌ పరీక్షలు చేసి, వైద్యులతో నిర్ధారణ, ఆ తర్వాత చికిత్స ప్రారంభిస్తారు. పరిస్థితి క్రిటికల్‌ అని నిర్ధారించుకుంటే ఉన్నత కేంద్రాలకు రెఫర్‌ చేస్తారు.

రక్తపోటు, మధుమేహ నియంత్రణ..

30 ఏళ్లు పైబడిన ప్రతీ వ్యక్తి తప్పనిసరిగా స్క్రీనింగ్‌ చేయిం చుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య విభాగం అధికారులు సూచిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయివరకు దశల వారీగా అమలు చేస్తున్నారు. వ్యక్తుల మొబిలైజేషన్‌ బాధ్యతను ఆశాలకు అప్పగించారు. స్క్రీనింగ్‌ ప్రక్రియను ఏఎన్‌ఎం, ఎంఎల్‌ హెచ్‌పీలు నిర్వహిస్తారు. నియంత్రణ లో ఉన్న రక్తపోటు, బ్లడ్‌షుగర్‌ రోగులకు స్థానిక ఏఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పీలు ఫాలో చేస్తారు. నియంత్రణలో లేని రోగులను జిల్లా ఆసుపత్రిలోని ఎన్‌సీడీ క్లినిక్‌కు రెఫర్‌ చేస్తారు.

సబ్‌సెంటర్‌ స్థాయిలో కార్యాచరణ

సబ్‌సెంటర్‌ స్థాయిలో గతంలో ఉన్న హైపర్‌టెన్షన్‌, డయాబెటిస్‌ కేసుల వివరాలను సిద్ధం చేస్తారు. ఎంఎల్‌హెచ్‌పీ, సూపర్‌వైజర్‌, ఏఎన్‌ఎం, ఎంపీహెచ్‌ఏ (ఎం), ఆశాలతో కూడిన టీం అవగాహన సమావేశాలు నిర్వహిస్తుంది. బీపీ, ఆర్‌బీఎస్‌ పరీక్షలు చేసి ఏవైనా అసాధారణ రోగాలు ఉంటే పీహెచ్‌సీకి పంపిస్తారు.

పీహెచ్‌సీ స్థాయి చర్యలు

పీహెచ్‌సీ స్థాయిలో రెఫర్‌ అయిన కేసులను మళ్లీ పరిశీలించి అవసరమైతే సీబీపీ, హెచ్‌బీఏ1సీ, ఎల్‌ఎఫ్‌టీ, ఆర్‌ఎస్‌బీ వంటి పరీక్షలు చేయిస్తారు. క్లిష్టమైన కేసులను ఉన్నతస్థాయి ఆసుపత్రులకు రిఫర్‌ చేసి, పేషెంట్లకు చికిత్స, కౌన్సెలింగ్‌ ఇస్తారు. ఒకరి కంటే ఎక్కువ వైద్యులు ఉన్న పీహెచ్‌సీల్లో ఓపీ సేవలు, ఫీల్డ్‌ మానిటరింగ్‌ (ఆరోగ్య జనగామ) ద్వారా స్క్రీనింగ్‌ శిబిరాల పర్యవేక్షణ చేస్తారు.

ఆరోగ్య శాఖ సందేశం

ఆరోగ్య జనగామతో ముందస్తు పరీక్షలు చేయించడం ద్వారా త్వరిత గుర్తింపుతో ప్రాణాలను కాపాడవచ్చు. ఈ ప్రోగ్రాంతో జిల్లా ఆరోగ్యవంతమైన వైద్య పరీక్షల్లో మరో ముందడు గు వేయనుంది. జిల్లాలో హైపర్‌టెన్షన్‌, మధుమేహ నియంత్రణను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

రాష్ట్రస్థాయి షూటింగ్‌బాల్‌ పోటీలకు ఎంపిక

జిల్లా సమాచారం

జిల్లా జనాభా: 5,33,104

30 ఏళ్లు పైబడిన వారు: 1,97,786

ప్రస్తుత మధుమేహ వ్యాధిగ్రస్థులు: 9.76 శాతం(అంచనా 17శాతం)

హైపర్‌టెన్షన్‌ ఉన్నవారు: 11.76శాతం

(అంచనా 30శాతం)

నమోదైన ఎన్సీడీ కేసులు: 32,022

ఆరోగ్య జనగామగా చేసుకుందాం

జిల్లాను మధుమేహం, అధిక రక్తపోటు రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజారోగ్య కార్యక్రమంలో భాగంగా ‘ఆరోగ్య జనగామ’ ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టాం. జిల్లాలో 30 ఏళ్లు పైబడిన ప్రతీ వ్యక్తికి హైపర్‌టెన్షన్‌, మధుమేహం స్క్రీనింగ్‌ నిర్వహించి, వ్యాధులను ముందుగానే గుర్తించి సరైన చికిత్స అందించడం అందరి లక్ష్యం. ప్రారంభ దశలో ప్రతీ గ్రామంలో రోజుకు 100 మంది చొప్పున స్క్రీనింగ్‌ చేస్తున్నాం. వచ్చే నెల 2 నుంచి ఏప్రిల్‌ 30 వరకు గర్భిణులు, యువతలో స్క్రీనింగ్‌ పూర్తి చేసి హెల్త్‌ కార్డులు ఇస్తాం.

ఆరోగ్య భాగ్యం1
1/7

ఆరోగ్య భాగ్యం

ఆరోగ్య భాగ్యం2
2/7

ఆరోగ్య భాగ్యం

ఆరోగ్య భాగ్యం3
3/7

ఆరోగ్య భాగ్యం

ఆరోగ్య భాగ్యం4
4/7

ఆరోగ్య భాగ్యం

ఆరోగ్య భాగ్యం5
5/7

ఆరోగ్య భాగ్యం

ఆరోగ్య భాగ్యం6
6/7

ఆరోగ్య భాగ్యం

ఆరోగ్య భాగ్యం7
7/7

ఆరోగ్య భాగ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement