వేగంగా జరుగుతోంది..
జిల్లాలో యూనిక్ కోడ్ రిజిస్ట్రేషన్ వివరాలు
జిల్లాలో రైతుల వారీగా యూనిక్ కోడ్ నంబర్ కేటాయింపుల ప్రక్రియ వేగంగా జరుగుతోంది. సుమారు 60శాతం వరకు యూనిక్ కోడ్ నంబర్లను కేటాయించగా, రోజు వారీగా పనులు జరుగుతున్నాయి. భవిష్యత్‌లో యూనిక్ కోడ్ ఆధారంగా వ్యవసాయానికి సంబంధించిన ప్రతీ సంక్షేమ కార్యక్రమం దీని ద్వారా జరుగుతుంది. ప్రతీ రైతుకు ఒక యూనిక్ కోడ్ నంబర్ వస్తుంది.
– రిజ్వాన్ బాషా, కలెక్టర్
జనగామ: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతులందరికీ ఒకే గుర్తింపు, ఒకే నంబర్ నినాదంతో ప్రత్యేక యూనిక్ కోడ్ నంబర్‌ను కేటాయించే విధానాన్ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా పట్టాదారు పాస్‌బుక్ ఆధారంగా యూనిక్ కోడ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. జిల్లాలోని మొత్తం 12 మండలాల్లో రిజిస్ట్రేషన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పలు మండలాలు 60 శాతానికి పైగా నమోదు పూర్తి చేసి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలోనూ మంచి ర్యాంకులు దక్కించుకుంది. దేవరుప్పుల, నర్మెట, చిల్పూరు మండలాలు ముందంజలో ఉండగా, రిజిస్ట్రేషన్ లక్ష్యాన్ని మించిన వేగంతో పనిచేస్తున్నాయి.
ప్రతీ రైతుకు యూనిక్ కోడ్ నంబర్
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతులందరికీ ప్రత్యేక యూనిక్ కోడ్ నంబర్ కేటాయించే విధానాన్ని తీసుకురావడంతో భవిష్యత్‌లో అన్ని వ్యవసాయ కార్యక్రమాలు వ్యవసాయ యాంత్రీకరణ, పంట ప్రోత్సాహకాలు, ఎరువుల సబ్సిడీలు, విత్తనాలు, పంట బీమా, పీఎం కిసాన్, రైతు బీమా, వ్యవసాయ అనుబంధ పథకాలు ఒక్క యూనిక్ కోడ్ నంబర్ ద్వారానే అమలుకానున్నాయి. దీంతో ప్రతీ రైతు వివరాలు సమగ్రంగా ప్రభుత్వ డిజిటల్ డేటాబేస్‌లో చేరి, పథకాలు పారదర్శకంగా, వేగవంతంగా చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యూనిక్ కోడ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతుండగా, జనగామ జిల్లా 12 మండలాల్లో రిజిస్ట్రేషన్ శాతం 63 శాతం దాటగా, ఓవరాల్‌గా 58.40 శాతం పూర్తయింది. దేవరుప్పుల, నర్మెట, చిల్పూరు, తరిగొప్పుల మండలాలు 60శాతానికి పైగా న మోదు సాధించగా, పాలకుర్తి, రఘునాథపల్లి, బచ్చన్నపేట, జనగామ తదితర మండలాల్లో కూడా మంచి పురోగతి కనిపిస్తోంది. అయితే జిల్లాలో ఇంకా సుమారు 40 శాతానికి పైగా పీపీబీ (పట్టాదారు పాస్‌బుక్)లకు రిజిస్ట్రేషన్ జరగాల్సి ఉంది.
వందశాతం వైపు పరుగులు
మండల వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో వ్యవసాయ సిబ్బంది ఇంటింటా పర్యటిస్తూ రైతుల వివరాలను సేకరిస్తున్నారు. ఆధార్, బ్యాంక్ అకౌంట్, భూమి వివరాలు, పంట సాగు సమాచారం వంటి వాటిని ఒకే ప్లాట్‌ఫామ్‌లో సమీకరించడంతో రైతుకు భవిష్యత్‌లో ఎలాంటి పథకమైనా ఈ యూనిక్ కోడ్ ద్వారా నేరుగా అందుబాటులోకి రానుంది. రాబోయే వారాల్లో మిగిలిన పీపీబీల రిజిస్ట్రేషన్లు పూర్తిచేసి జిల్లాను వందశాతం వైపు తీసుకెళ్లాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతుకు ‘ఒకే గుర్తింపు, ఒకే నంబర్’ అనే నినాదంతో యూనిక్ కోడ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం గ్రామాల్లో చైతన్యాన్ని పెంచుతోంది.
జిల్లాలో 1,98,360 పీపీబీలు
జిల్లాలో పట్టాదార్ పాస్ పుస్తకాలు 1,98,360 ఉండగా, ఇప్పటి వరకు 1,15,830 యూనిక్ కోడ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం రిజిస్ట్రేషన్ల శాతం 58.40శాతం పూర్తి కాగా, త్వరలోనే వందశాతం లక్ష్యం చేరుకోనున్నారు.
రైతు సంక్షేమానికి
కేంద్రం కీలక అడుగు
భవిష్యత్ వ్యవసాయ
డిజిటలైజేషన్‌కు మార్గం
జిల్లాలో 60 శాతం పూర్తి
ఒక్కకోడ్‌తోనే అన్ని సేవలు
మూడు మండలాల్లో ముందంజ
మండలం పట్టాదారు పూర్తయిన శాతం
పాస్‌పుస్తకాలు రిజిస్ట్రేషన్లు
దేవరుప్పుల 18,127 11,491 63.39
నర్మెట 11,198 7,063 63.07
చిల్పూరు 13,920 8,698 62.49
తరిగొప్పుల 8,795 5,432 61.76
కొడకండ్ల 10,609 6,504 61.31
స్టేషన్‌ఘన్‌పూర్ 15,443 9,312 60.30
పాలకుర్తి 24,118 14,129 59.79
రఘునాథపల్లి 22,348 13,129 58.75
బచ్చన్నపేట 19,270 10,840 56.25
జఫర్‌గఢ్ 18,488 9,233 49.93
జనగామ 18,370 10,141 55.20
లింగాలఘణపురం 17,674 9,566 54.12
మొత్తం 1,98,360 1,15,830 58.40
వేగంగా జరుగుతోంది..
వేగంగా జరుగుతోంది..


