సొంతింటి కలను సాకారం చేసిన ప్రభుత్వం
చిల్పూరు: నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని శ్రీపతిపల్లి గ్రామంలో రంగు రమేష్, శ్రీవాణిలు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్లాడుతూ నియోజకవర్గంలోని 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా ప్రస్తుతం 85 శాతం పూర్తి చేసుకుని గృహప్రవేశాలు చేసుకున్నారన్నారు. అనుమతులు లేకుండా బేస్‌మెంట్ నిర్మాణాలు, స్లాబ్ లెవల్ వరకు పూర్తి చేసుకున్న ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రభుత్వం వెసలుబాటు కల్పించేందుకు జీఓ 96 తీసుకువచ్చిందని, ఈ జీఓ ద్వారా లబ్ధిదారులకు ఇండ్లను పూర్తి చేయించేందుకు నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో చిల్పూరు ఆలయ చైర్మన్ శ్రీధర్‌రావు, నాయకులు గడ్డమీది సురేష్, బొమ్మిశెట్టి బాలరాజు, షకీల్, పొలబోయిన నరేష్, హరిబాబు, ఏదునూరి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి


