గోదావరి ఇంటెక్ వెల్‌కు నేడు సీఎం రేవంత్ రెడ్డి
దేవాదుల ప్రాజెక్టు అంశం వివాదం అవుతున్న నేపథ్యంలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో ఆ ప్రాజెక్టు ఇంటెక్ వెల్‌ను సందర్శించనున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న సీఎం.. అక్కడినుంచి ఇంటెక్ వెల్‌ను సందర్శించి అక్కడే అధికారులతో ప్రాజెక్టుపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. నీటిపారుదలశాఖ మంత్రి గతంలో 2026 మార్చి వరకు ప్రాజెక్టు పూర్తి చేసి పూర్తి ఆయకట్టుకు నీరందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో నెలరోజులే గడువు ఉండటంతో ప్రాజెక్టు పెండింగ్ భూసేకరణ, మూడో విడత పనులపై సీఎం రేవంత్‌రెడ్డి అఽధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు అధికారవర్గాల సమాచారం. శనివారం రాత్రి నుంచి పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.


