సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడొచ్చు | - | Sakshi
Sakshi News home page

సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడొచ్చు

Feb 22 2026 8:08 AM | Updated on Feb 22 2026 8:08 AM

సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడొచ్చు

సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడొచ్చు

జనగామ రూరల్‌: సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడుకోగలమని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కె.మల్లికార్జున రావు అన్నారు. శనివారం సమగ్ర సీపీఆర్‌ శిక్షణ ప్రదర్శన కార్యక్రమం కలెక్టరేట్‌లోని సమావేశ హాలులో నిర్వహించారు. జిల్లాలోని అన్ని ఆర్‌బీఎస్‌కే మొబైల్‌ హెల్త్‌ టీమ్స్‌కు డాక్టర్‌ సాయి ప్రణీత శిక్షణ ఇచ్చారు. ప్రాణాపాయ స్థితిలో ముఖ్యంగా అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం వంటి అత్యవసర సందర్భాల్లో సమయోచితంగా స్పందించే సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ శిక్షణ ఉద్దేశ్యమన్నారు. గుండె ఆగిన లక్షణాలను తొందరగా గుర్తించడం, స్పందన పరిశీలించడం, అత్యవసర సేవలను సమాచారం ఇవ్వడం, సరైన చెస్ట్‌ కంప్రెషన్‌ పద్ధతి ప్రాక్టికల్‌ డెమో ద్వారా వివరించారు. అధిక నాణ్యత గల సీపీఆర్‌ చేయడం ద్వారా ప్రాణాలను కాపాడగలమన్నారు. శిక్షణలో అన్ని ఆర్‌బీఎస్‌కే సభ్యులు పాల్గొని సీపీఆర్‌ విధానాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్‌ శ్యామ్‌ కుమార్‌, కమల్‌ హాసన్‌, శ్రీతేజ, శరత్‌, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

డీఎంహెచ్‌ఓ మల్లికార్జునరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement