మోడల్ మున్సిపాలిటీగా ఘన్‌పూర్
స్టేషన్‌ఘన్‌పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేయడమే అందరి లక్ష్యమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ మొదటి పాలకవర్గం సర్వసభ్య సమావేశాన్ని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిఽథులుగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హాజరయ్యారు. సమావేశంలో పట్టణాభివృద్ధి, మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రోడ్ల అభివృద్ధి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రధానంగా తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలపై ఎక్కువ దృష్టి సారించాలని, 2050 సంవత్సరపు అవసరాలకు అనుగుణంగా తాగునీటి సరఫరాపై డీటేయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టును రూపొందించాలని అధికారులకు సూచించారు. మున్సిపాలిటీకి మంజూరైన రూ.50కోట్ల పనులకు సంబంధించి మార్చి మొదటి వారం నాటికి అన్ని అనుమతులు తీసుకుని టెండర్లు పూర్తి చేసి పనులను ప్రారంభించాలని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు రాలేదని తన దృష్టికి వచ్చిందని, ఈనెల 23న(సోమవారం) 3 నెలల వేతనాలు అందిస్తామని, రానున్న రెండు మూడు నెలల్లో కార్మికుల పెండింగ్ వేతనాలు పూర్తిస్థాయిలో వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేలా అందరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు. వార్డులలో ప్రజల అవసరాలను గుర్తించి ప్రణాళిక ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పింకేశ్‌కుమార్, ఆర్‌డీఓ డీఎస్ వెంకన్న, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, మేనేజర్ సత్యనారాయణ, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్‌కుమార్, వైస్ చైర్మన్ నీల రాజమ్మగట్టయ్య, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రైతుల సంక్షేమానికి పెద్దపీట
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తోందని, రైతులపై ఆర్థిక భారం తగ్గించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ పట్టణ కేంద్రంలోని రైతువేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా డీఆర్‌డీఏ ఆధ్వర్యంలోమహిళా సంఘాలకు సబ్సిడీపై అందించిన చేపల విక్రయ మొబైల్‌వ్యాన్‌ను ప్రారంభించారు. ఏఓ చంద్రన్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథి ఎంపీ కావ్య మాట్లాడారు.. వ్యవసాయ యాంత్రీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం అందిస్తున్నాయన్నారు. మారుతున్న పరిస్థితులను అనుగుణంగా రైతులు వ్యవసాయ యాంత్రీకరణ పద్ధతులను పాటించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సబ్సిడీ వ్యవసాయ పరికరాలు జిల్లాకు 3,320 మంజూరు కాగా అందులో అత్యధికంగా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి 1,600 యూనిట్లు మంజూరయ్యాయని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పింకేష్‌కుమార్, ఆర్‌డీఓ డీఎస్ వెంకన్న, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంబికాసోని, డీఆర్‌డీఏ పీడీ వాసంతి, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, చైర్మన్ వినయ్‌కుమార్, వైస్ చైర్మన్ రాజమ్మగట్టయ్య, మారపాక రాములు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
తొలి పాలకవర్గ సర్వసభ్య
సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి
హాజరైన ఎంపీ కావ్య, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్


