పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు కంటిపరీక్షలు | - | Sakshi
Sakshi News home page

పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు కంటిపరీక్షలు

Feb 28 2026 7:16 AM | Updated on Feb 28 2026 7:16 AM

పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు కంటిపరీక్షలు

పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు కంటిపరీక్షలు

జనగామ: పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో డీజీపీ ఆదేశాలు, సీపీ ఉత్తర్వుల మేరకు డీసీపీ రాజమహేంద్రనాయక్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఆటోడ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఆటో డ్రైవర్లకు రాత్రి డ్రైవింగ్‌, దుమ్ము, కాలుష్యం వల్ల వచ్చే కంటి సమస్యలపై డాక్టర్లు అవగాహన కల్పించారు. చూపు సమస్యలు ఉన్న వారికి అద్దాలు పంపిణీ చేశారు. పోలీసుల సేవా కార్యక్రమంపై ఆటో డ్రైవర్లు సంతోషం వ్యక్తం చేస్తూ ఆ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్‌ఐలు భరత్‌, రతీష్‌, చెన్నకేశవులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement