నాణ్యమైన విద్యకు ‘ఆదర్శం’ | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యకు ‘ఆదర్శం’

Mar 5 2026 7:38 AM | Updated on Mar 5 2026 7:38 AM

మోడల్‌ పాఠశాలల గత నాలుగేళ్ల ఉత్తీరతా శాతం

పరీక్ష విధానం

జనగామ రూరల్‌: చదువులో ఆదర్శంగా ఉంటూ బలహీన వర్గాల విద్యార్థులకు గొప్ప అవకాశంగా ఆదర్శ పాఠశాలలు నిలుస్తున్నాయి. ఇటు ఇంగ్లిష్‌ మీడియం చదువులు..అటు పౌష్టికాహారం అందిస్తూ ఎంతో మంది విద్యార్థుల అభివృద్ధికి తోడ్ప డుతున్నాయి. ఇందుకు నిదర్శనంగా జిల్లాలో పదో తరగతిలో 98 శాతం, ఇంటర్‌లో 95 శాతంపైగా ఉత్తీర్ణత సాధిస్తున్నాయి. ప్రస్తుతం 2026–27 సంవత్సరానికి గాను 6వ తరగతిలో 100 సీట్లు, 7 నుంచి 10వ తరగతి వరకు మిగిలి ఉన్న పరిమిత సీట్లకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈనెల 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోనే అవకాశం కల్పించారు. జిల్లాలో మొత్తం 8 ఆదర్శ పాఠశాలు ఉండగా ఒక్కో పాఠశాలలో 6వ తరగతి ప్రవేశానికి 100 సీట్లు ఉన్నాయి. మిగిలిన తరగతులకు సంబంధించి ఖాళీలు భర్తీ చేయనున్నారు. జిల్లాలో చౌడారం, వెల్ది, బచ్చన్నపేట, కొడకండ్ల, లింగాల ఘణపురం, జఫర్‌గఢ్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌, నర్మెట మండలాల్లో పాఠశాలలున్నాయి.

వారం ముందు నుంచే హాల్‌ టికెట్లు

ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు 10వ తేదీ తర్వాత ఆన్‌లైన్‌లో హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఏప్రిల్‌ 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 6 తరగతి విద్యార్థులకు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్ష కోసం ఓసీ విద్యార్థులు రూ.200, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులు రూ.125 ఫీజు చెల్లించాలి.

సంవత్సరం ఉత్తీర్ణతా

శాతం

2021–22 94.72

2022–23 91.90

2023–24 98.14

2024–25 98.98

గ్రామీణ పేద విద్యార్థులకు

గొప్ప అవకాశం

ఆరు నుంచి టెన్త్‌ వరకు ప్రవేశాలు

ఈనెల 10 వరకు దరఖాస్తుల స్వీకరణ

ఏప్రిల్‌ 19న పరీక్ష.. జిల్లా వ్యాప్తంగా 8 పాఠశాలలు

ఆరో తరగతి ప్రవేశ పరీక్షలో 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలో ఉంటుంది. తెలుగు, గణితం, ఎన్విరాన్మెంటల్‌ సైన్స్‌, ఆంగ్లం పాఠ్యాంశాల్లో ఒక్కో దాని నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి. 7 నుంచి 10వ తరగతి వారికి గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రం, ఇంగ్లిష్‌ నుంచి 100 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో దాని నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. 2 గంటల పాటు ఆబ్జెక్టివ్‌ విధానంలో పరీక్ష ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement