జనగామ రూరల్: దేశాభివృద్ధిలో యువత కీలకపాత్ర పోషించాలని కేయూ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ అన్నారు. గురువారం పట్టణంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ కళాశాలలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ జిల్లా స్థాయి పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కాకతీయ యూనివర్సిటీ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ మాట్లాడుతూ..ప్రజాస్వామ్య విలువలు, నా యకత్వ లక్షణాలు విద్యార్థుల్లో పెంపొందించడానికి యూత్ పార్లమెంట్ వంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం యూత్ పార్లమెంట్ పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. సంధ్యారాణి, డీఎస్ వెంకన్న, కె.వేణుగోపాల్‌రావు, వి.ప్రసాద్‌రావు, ప్రోగ్రాం ఆఫీసర్ కె.అరుణ కుమారి పాల్గొన్నారు.
రఘునాథపల్లి: మండలంలోని అశ్వరావుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన బోడ లాస్య జాతీయ స్థాయి ఇన్‌స్పైర్ అవార్డుకు ఎంపిౖకైనట్లు పాఠశాల హెచ్‌ఎం పి.శోభన్‌బాబు గురువారం తెలిపారు. భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ప్రకటించిన ఎంపిక జాబితాలో 9వ తరగతి విద్యనభ్యసిస్తున్న బోడ లాస్య స్థానం సంపాదించుకుంది. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మతకను, శాసీ్త్రయ దృక్పథాన్ని వెలికిదీసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందజేస్తోంది. సందర్భంగా లాస్యను సర్పంచ్ చైతన్య, ఏఏపీసీ చైర్మన్ రేణుక, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందించారు.
హన్మకొండ: విద్యుత్ ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ధరలు, క్రాస్ సబ్సిడీ, సర్ చార్జీల ప్రతిపాదనలపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఈ నెల 6న బహిరంగ విచారణ చేపట్టనుంది. ఈ మేరకు టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం బహిరంగ విచారణకు ఏర్పాట్లు చేసింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సవరించబడిన ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ధరలు, క్రాస్ సబ్సిడీ, సర్ చార్జీల ప్రతిపాదనలపై శుక్రవారం ఉదయం 10:30 గంటలకు హనుమకొండ కలెక్టరేట్‌లో ఈ విచారణ చేపట్టనున్నట్లు యాజమాన్యం ఒక ప్రకటనలో వివరించింది. ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ డాక్టర్ దేవరాజ్ నాగార్జున్, సభ్యులు రఘు కంజర్ల, సీహెచ్.శ్రీనివాస్‌రావు పాల్గొంటారని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యుత్ వినియోగదారులు ఈ బహిరంగ విచారణకు హాజరు కావాలని కోరారు.
కాజీపేట అర్బన్ : కాజీపేట మండలం మడికొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో(మహిళా ప్రాంగణం)లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య రిటైల్ సేల్స్ అసిస్టెంట్ ఉపాధి నిమిత్తం ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రాంగణం జిల్లా అధికారి జయశ్రీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగులు ఈనెల 14వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు 76600 22526 లేదా 76600 22525 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
మహాసభలను
జయప్రదం చేయండి
జనగామ రూరల్: జీఎంపీఎస్ 3వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి సాదం రమేశ్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా అధ్యక్షుడు మోటే దేవేందర్ ఆధ్యక్షతన జిల్లా కేంద్రంలోని బీరప్ప గుడి ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.. అనంతరం మహాసభల కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు జీగారి యాదగిరి, సహాయ కార్యదర్శి కన్నెబోయిన బాలరాజు, ఉలిగిల్ల చంద్రయ్య పాల్గొన్నారు.


