పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్‌ పరీక్షలు

Mar 6 2026 9:06 AM | Updated on Mar 6 2026 9:06 AM

పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్‌ పరీక్షలు

కేయూ క్యాంపస్‌: కేయూ పరిధిలో ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాలో గురువారం పీజీ కోర్సులు ఎంఏ, ఎంకామ్‌, ఎమ్మెస్సీ తదితర కోర్సుల మొదటి సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీలోని పలు పరీక్ష కేంద్రాలను హ్యూమనిటీస్‌ భవనం, మైక్రోబయాలజీ, జియాలజీ, కామర్స్‌అండ్‌ బిజినెస్‌మేనేజ్‌మెంట్‌ కళాశాలలను కేయూ రిజిస్ట్రార్‌ రామచంద్రం, పరీక్షల విభాగం అధికారులతో కలిసి సందర్శంచి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. పరీక్షల నిర్వహణను పరిశీలించిన వారిలో యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్‌ ఆచార్య టి.మనోహర్‌, పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్‌, అదనపు పరీక్షల నియంత్రణాధికారి శ్రీనివాస్‌, వివిధ విభాగాల అధిపతులు ఉన్నారు. సుబేదారిలోని యూనివర్సిటీ మహిళా పీజీ కళాశాల పరీక్ష కేంద్రంలో ఒకరు కాపీయింగ్‌ చేస్తూ పట్టుబడి డీబార్‌ అయినట్లు కేయూ అదనపు పరీక్షల నియంత్రణాధికారి పి.శ్రీనివాస్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement