జనగామ: పట్టణంలోని 22వ వార్డులో ఈనెల 6(శుక్రవారం)న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ తెలిపారు. గురువారం తన చాంబర్‌లో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, డీఈ రాజ్‌కుమార్, వార్డు కౌన్సిలర్ మారబోయిన పాండు తదితర అధికారులతో కలిసి ఆమె మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కొనసాగుతున్న ప్రజా సంక్షేమపాలనలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకా ల పురోగతిని ప్రజలకు వివరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, ప్రజాప్రతి నిధులు పాల్గొని ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన పొందాలని ఆమె కోరారు.


