కాంగ్రెస్ కౌన్సిలర్లను అరెస్ట్ చేయండి
● అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిరసన
జనగామ: పురపాలిక చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సమయంలో 8వ వార్డు దళిత కౌన్సిలర్‌ను ఓటు వేయకుండా అడ్డుకోవడమే కాకుండా దాడిచేసిన కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు చెంచారపు కరుణాకర్‌రెడ్డి, మారబోయిన పాండును వెంటనే అరెస్ట్ చేయాలని దళిత, గిరిజన మున్సిపల్ కౌన్సిలర్లు ఊడుగుల కిష్టయ్య, పానుగంటి సువార్త ప్రవీణ్, సజ్జ దుర్గప్రసాద్ డిమాండ్ చేశారు. దళిత మహిళా కౌన్సిలర్‌పై దాడికి నిరసనగా బుధవారం అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ చౌరస్తాలో నిరసన తెలిపారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతి చేసిన తర్వాత వారు మాట్లాడారు..చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సమయంలో గూండాల్లాగా వ్యవహరించిన పాండు, కరుణాకర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయగా, వెంటనే వారిని అరెస్ట్ చేయాలన్నారు. ఎస్సీ,ఎస్టీ కమిషన్‌లో సైతం ఫిర్యాదు చేయబోతున్నామన్నారు. కార్యక్రమంలో పసుల ఏబేలు, గద్దల నర్సింగరావు, కన్నారపు పరుశరాములు, మల్లిగారి రాజు, అనిత, తిప్పారపు విజయ్, కన్నారపు శివశంకర్, ఊడుగుల సాగర్, కందుకూరి ప్రభాకర్, తాళ్లపల్లి సురేష్, బొట్ల శంకర్, అనిల్, తోట సునీల్, కొమ్ము రాజు, బక్క సునీల్, గద్ద సాయికుమార్, గుజ్జిక రాజు, ఇరుగు యాకన్నతో పాటు కుల సంఘాలు, ఎమ్మార్పీఎస్, మాలమహానాడు నాయకులు పాల్గొన్నారు.


