నేడు బుగులు వెంకన్న కల్యాణం
చిల్పూరు: శ్రీ బుగులు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 28న (శనివారం) నిర్వహించే కల్యాణానికి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించినట్లు ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు తెలిపారు. గుట్ట కింద అంగడి ప్రదేశంలోని కల్యాణ మండపంలో నిర్వహించే స్వామివారి కల్యాణ ఏర్పాట్లను శుక్రవారం ఈఓ పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. స్వామివారి కల్యాణానికి తరలివచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
ఘనంగా ఎదుర్కోళ్లు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజైన శుక్రవారం ఉదయం ఆరుట్ల రాకేషచార్యుల సమక్షంలో ఆలయ అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేదమంత్రాల నడుమ నిత్యనిధిహోమం, సాయంత్రం 5 గంటలకు ఎదుర్కోళ్లు కార్యక్రమం నిర్వహించారు.
నేడు బుగులు వెంకన్న కల్యాణం
నేడు బుగులు వెంకన్న కల్యాణం


