‘పది’లంగా ౖపైపెకి!
ప్రత్యేక తరగతులు
రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానమే లక్ష్యంగా ప్రణాళిక
ప్రత్యేక తరగతులను బోధిస్తున్న ఉపాధ్యాయుడు
టీశాట్‌లో పాఠాలు వింటున్న విద్యార్థులు
జనగామ రూరల్: టెన్త్‌లో జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కలెక్టర్ విద్యాశాఖ సమన్వయంతో వినూత్న కార్యక్రమాలు అమలుచేస్తున్నారు. కలెక్టర్ ‘విజయోస్తు’ అనే కార్యక్రమాన్ని చేపట్టడంతో గత సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో 98.16 శాతంతో జిల్లా 3వ స్థానంలో నిలిచింది. 2024–25లో 4వ స్థానంలో నిలిచింది. కాగా 2025–26 సంవత్సరంలో వచ్చిన స్థానాన్ని మరింతగా మెరుగుపర్చుకునేందుకు తాజాగా విజయోస్తు 2.0 ,ప్రేరణ, అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. కలెక్టర్ ప్రత్యేక చొరవతో ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించి అమలు చేస్తున్నారు. ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులకు బాధ్యతలు కేటాయించి గూగూల్ మీట్ ద్వారా విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. దీనికి తోడు టీశాట్ ద్వారా రోజూ ఉదయం 9.30గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు ప్రసారమయ్యే కార్యక్రమంలో ప్రత్యేక పాఠాలను విషయనిపుణులతో బోధించారు. ఇప్పటికే భౌతిక, జీవశాస్త్రం, ఇంగ్లిష్, హిందీ, బోధన, గణితం, తెలుగు, సాంఘిక శాస్త్రం, ఉర్దూ భాషలో గణిత, భౌతిక, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రాల పట్టు సాధించారు. జిల్లా వ్యాప్తంగా 183 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వీటిలో 2025–26విద్యా సంవత్సరానికి పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు 6,442 మంది ఉన్నారు.
ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌తో ముందుకు..
గతేడాది వచ్చిన ఫలితాలను దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ విద్యాశాఖ అఽధికారులు ఈఏడాది యాక్షన్ ప్లాన్ రూపొందించారు. కలెక్టర్ నిత్యం పర్యవేక్షిస్తూ పాఠశాలల్లో అమలవుతున్న కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఎస్‌ఏ 1 పరీక్షల అనంతరం కలెక్టర్ ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. ఏబీసీడీలుగా విద్యార్ధులను వర్గీకరించి సీ, డీ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సబ్జెక్ట్ వారీగా వారికి వచ్చే సమస్యలు నివృత్తి చేస్తున్నారు. పూర్తిగా వెనుకబడిన విద్యార్థులకు కనీసం ఉత్తీర్ణత సాధించడానికి ప్రశ్నల వారీగా ప్రిపరేషన్ చేస్తున్నారు. అలాగే పరీక్షల సమయంలో మూడు నుంచి నాలుగు రోజులు సమయం వస్తుండడంతో విద్యార్థులు ఉన్న మూడు రోజులు కూడా పాఠశాలకు రావాల్సి ఉంటుంది. వారికి ఎలాంటి అంశాలు బోధించాలనే అంశాలను ఉపాధ్యాయులకు తెలియజేశారు. అలాగే 14 రోజల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ప్రధానంగా విద్యావిషయక అంశాలను తెలియజేయడం, పునఃశ్చరణ, సాధనపై దృష్టి పెట్టాలి.
గతేడాది జిల్లాకు మూడోస్థానం
పక్కాగా విజయోస్తు 2.0,
ప్రేరణ పేరుతో కార్యక్రమాలు
వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
వందశాతం ఉత్తీర్ణత దిశగా
అధికారుల కృషి
సత్ఫలితాలపై కలెక్టర్
రిజ్వాన్ బాషా షేక్ చొరవ
ప్రస్తుతం నిర్వహించే ప్రత్యేక తరగతుల్లో రెండు నుంచి మూడు ముఖ్యమైన భావనలను వివరించాలి. స్వయంగా చదవడం, రాత సాధన, ఉపాధ్యాయుడి మార్గదర్శకత్వం ఉండాలి. 20 నిమిషాల పాటు సబ్జెక్టు ఉపాధ్యాయులతో భావనలపై పూర్తి వివరణ, 40 నిమిషాల పాటు సాధన ఉండాలి. రెగ్యులర్ తరగతిలో ప్రతిరోజు కనీసం మూడు ప్రశ్నలకు సమాధానం రాసేలా సాధన చేయించాలి. మూడేళ్లుగా పరీక్ష ప్రశ్నపత్రా లను విశ్లేషించాలి. సమాధానాల్లో విద్యార్థుల తప్పులను గుర్తించి వివరించాలి. వార్షిక పరీక్షలకు మధ్య విరామ రోజుల్లో ఏం చేయాలనే కార్యాచరణ ప్రణాళికలో పేర్కొన్నారు. ఆయా రోజుల్లో సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులు హాజరయ్యేలా ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలి.
సమాధాన పత్రాలను ఆలస్యం చేయకుండా మూల్యాంకనం చేపట్టి విశ్లేషణ చేయాలి. ప్రశ్నల వారీగా అంచనా. సమాధాన పత్రాలను రాసే సరైన విధానం.. విద్యార్థులు సాధారణంగా చేసే తప్పులను వివరించాలి. మూల్యాంకనం చేసిన విద్యార్థుల సమాధాన పత్రాలను వారి తల్లిదండ్రులకు పంపించాలి. విద్యార్థి ప్రగతిపై వారికి అవగాహన కల్పించాలి. అలాగే ప్రీఫైనల్ పరీక్షల అనంతరం ఉత్తీర్ణత కాని, సగటు మార్కులు తెచ్చుకున్న, మంచి ప్రగతిని చూపిన విద్యార్థులకు అనుగుణంగా విద్యా వ్యూహాలను అమలు చేయాలి.
‘పది’లంగా ౖపైపెకి!


