వేసవికి విద్యుత్‌శాఖ సిద్ధం | - | Sakshi
Sakshi News home page

వేసవికి విద్యుత్‌శాఖ సిద్ధం

Feb 24 2026 7:23 AM | Updated on Feb 24 2026 7:23 AM

వేసవికి విద్యుత్‌శాఖ సిద్ధం

వేసవికి విద్యుత్‌శాఖ సిద్ధం

జనగామ: జిల్లాలో వేసవికాలంలో పెరగనున్న విద్యుత్‌ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఎన్పీడీసీఎల్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఆ శాఖ ఎస్‌ఈ సంపత్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయా సబ్‌స్టేషన్లను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. గతేడాది మార్చిలో విద్యుత్‌ డిమాండ్‌ 5,816 మెగావాట్లు ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరి 21 నాటికి 5,904 మెగావాట్లకు చేరిందన్నారు. జనగామ సర్కిల్‌లో ఈ నెల 17న గరిష్టంగా డిమాండ్‌ 368.17 మెగావాట్లుగా నమోదైందని, రాబోయే వేసవిలో అత్యధికంగా డిమాండ్‌ పెరిగినా ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా అందించేందుకు ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. పట్టణాల్లో పెరుగుతున్న లోడ్‌ను దృష్టిలో ఉంచుకుని 70 అదనపు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుతో సామర్థ్యం పెంచినట్లు తెలిపారు. అలాగే అదనంగా 38 కొత్త పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లు, 14 పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. సర్కిల్‌ పరిధిలో 6 కొత్త సబ్‌స్టేష న్ల నిర్మాణం కూడా ప్రారంభమైందని, విద్యుత్‌ సరఫరా స్థిరత్వం కోసం 30 కొత్త బ్రేకర్లు, నాణ్యత మెరుగుపరిచేందుకు 14 కొత్త 33/11 కేవీ ఇంటర్‌ లింకింగ్‌ లైన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వేసవిలో వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ సరఫరా అందించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేస్తున్నామని ఎస్‌ఈ తెలిపారు. అంతరాయం లేని సరఫరా కొనసాగేందుకు అన్ని స్థాయిల్లో ముందస్తు చర్యలు సిద్ధంగా ఉన్నాయన్నారు.

డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా

ఎస్‌ఈ సంపత్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement