ఇస్మార్ట్..స్టేషన్
ప్రస్తుతం జరుగుతున్న
ముఖ్య పనులు:
జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌కు కొత్త సొబగులు
జనగామ: అమృత్ భారత్ పథకంలో భాగంగా జనగామ రైల్వేస్టేషన్ రూపురేఖలు మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.125 కోట్లతో ఆధునికీకరణ వేగవంతమైంది. తొలి విడతగా విడుదలైన రూ.25 కోట్లతో ఫుట్‌ఓవర్ బ్రిడ్జ్, ప్లాట్‌ఫామ్ విస్తరణ, డిజిటల్ సదుపాయాలు, ప్రాంగణ సుందరీకరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఉత్తర, దక్షిణ రైల్వే మార్గానికి కీలకంగా ఉన్న ఈ స్టేషన్, అభివృద్ధి పూర్తయ్యాక అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు కొత్త అనుభవాన్ని అందించనుంది. ఈ పథకంలో స్టేషన్ లను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తారు. ప్రయాణికుల అవసరాలు మాత్రమే కా క పెరిగే రద్దీ, వసతుల విస్తరణ, రైల్వే కార్యకలాపాల బలోపేతం వంటి అంశాలకూ ప్రా ధాన్యం ఇస్తారు. ఇదే ప్రక్రియలో భాగంగా జనగామ స్టేషన్ ప్రస్తుతం భారీ మార్పులకు వేదికవుతోంది.
మొదటి విడతలో రూ.25కోట్ల ఖర్చు
జిల్లా కేంద్రంగా ఉన్న జనగామ రైల్వేస్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఆధునిక సదుపాయాలతో రూపుదిద్దుకుంటోంది. రైల్వేశాఖ ఈ స్టేషన్ అభివృద్ధికి మొదటి విడతలో సుందరీకరణ, ప్రాథమిక మౌలిక వసతుల పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం స్టేషన్‌లో కొత్త ఫుట్‌ఓవర్ బ్రిడ్జి, డిజిటల్ డిస్‌ప్లే కోచ్, రెండు ప్లాట్‌ఫామ్‌ల విస్తరణ, ప్రయాణికులకు అనుగుణంగా టికెట్ కౌంటర్ ఆధునీకరణ, పచ్చదనంతో స్టేషన్ ప్రాంగణం అందుబాటులోకి తేవడం వంటి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. నూతన హంగులు, ప్రయాణికులు కూర్చునే సదుపాయాలు, తాగునీటి సదుపాయాలు, ఆధునిక టాయిలెట్లు, సీసీటీవీ పర్యవేక్షణ వ్యవస్థ, ఏసీ వెయిటింగ్ హాల్స్, క్రమబద్ధమైన పార్కింగ్ ప్రాంతాలు వంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు జరుగుతున్నాయి.
దక్షిణ,ఉత్తర రాష్ట్రాలకు కేంద్రంగా
దక్షిణ భారతాన్ని ఉత్తర భారతంతో కలిపే కీలక మార్గంలో ఉన్న ఈ స్టేషన్‌పై ప్రతీ రోజు విజయవాడ, చైన్నె, ఢిల్లీ, హైదరాబాద్, మహారాష్ట్ర వంటి అనేక ప్రాంతాలకు రైళ్లు ప్రయాణిస్తాయి. వ్యాపార వాణిజ్య ప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు ఇలా అన్ని వర్గాల వారు పెద్ద సంఖ్యలో ఈ మార్గాన్ని వినియోగిస్తున్నారు. రోజురోజుకూ ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో స్టేషన్‌ను ఆధునిక ప్రమాణాలకు తగిన విధంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని రైల్వే శాఖ భావించింది. దీంతో జనగామ పట్టణ అభివృద్ధి, వాణిజ్య వృద్ధి, ప్రయాణికుల రద్దీ పెరుగుదలకు కొత్త దిశగా మారుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
రెండు ప్లాట్‌ఫామ్‌ల విస్తరణ, వాటిపై విశాలమైన రూఫ్ షెల్టర్లు
కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం
ఆధునిక డిజిటల్ డిస్‌ప్లే కోచ్ బోర్డు
స్టేషన్ భవనం విస్తరణ, రీడిజైన్
కొత్త చార్జింగ్ స్టేషన్లు, ఎనర్జీ ఎఫిషియంట్ లైటింగ్
ఆధునీకరించబడిన టికెట్ కౌంటర్లు, రిజర్వేషన్ హాల్
పచ్చదనం పెంపు, ల్యాండ్‌స్కేపింగ్
పార్కింగ్ స్థలాల విస్తరణ
సుందరీకరణ పనులకు
రూ.125 కోట్ల కేటాయింపులు
మొదటి విడతలో రూ.25కోట్ల ఖర్చు
ప్రారంభానికి సిద్ధం..వడివడిగా పనులు
అత్యాధునికంగా ఫుట్‌ఓవర్ బ్రిడ్జి,
ఎస్కలెటర్, డిస్‌ప్లేకోచ్
ఇస్మార్ట్..స్టేషన్
ఇస్మార్ట్..స్టేషన్


