అకాల వర్షం
జలమయంగా మారిన జనగామ పట్టణ రోడ్డు
● జనగామలో జలమయమైన రోడ్లు
● విద్యుత్ సరఫరాకు అంతరాయం
జనగామ: వేసవి ఉక్కపోత మధ్యలో అకాల వ ర్షం కొంత ఉపశమనం ఇచ్చినా.. సోమవారం సాయంత్రం కురిసిన వర్షంతో పట్టణంలో ప్రజ లు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. హనుమకొండ, హైదరాబాద్ రోడ్డుపై డ్రెయినేజీ నాళాలు, పొంగి పొర్లడంతో మురికి నీరు రోడ్డుమీదకు చేరి వ్యాపార సముదాయాల మెట్ల వరకు ప్రవహించింది. రోడ్లు జలమయం కావడంతో వాహనాలు నిలిచిపోయాయి. బయట పనుల కోసం వచ్చిన ప్రజలు సమీప దుకా ణా ల్లో తలదాచుకునే పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా, అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు.
అకాల వర్షం
అకాల వర్షం


