సమస్యలు తీరేదెన్నడు? | - | Sakshi
Sakshi News home page

సమస్యలు తీరేదెన్నడు?

Feb 24 2026 7:23 AM | Updated on Feb 24 2026 7:23 AM

సమస్య

సమస్యలు తీరేదెన్నడు?

ఏళ్ల తరబడి కలెక్టరేట్‌ చుట్టూ ప్రదక్షిణలు

ఈ ఫొటోలో కనిపిస్తున్న 70 ఏళ్ల వృద్ధురాలు జనగామ మండలం సిద్దెంకి గ్రామానికి చెందిన గురిజాల బాలమణి. ఇద్దరు కుమారులు ఉన్నారు. తనకున్న 4 ఎకరాల భూమిని 2 ఎకరాల చొప్పున రిజిస్ట్రేషన్‌ చేసింది. ఇప్పుడు తన బాగోగులు చూసుకోవడం లేదని, దిక్కుతోచని స్థితిలో ఉన్నానని కలెక్టర్‌ను వేడుకుంది. తన భూమి తనకు ఇప్పించాలని కన్నీటి పర్యంతమైంది.

జనగామ రూరల్‌: కుమారులు చూసుకోవడం లేద ని, ఉద్యోగానికి రానివ్వడం లేదని, అక్రమంగా ప ట్టా చేసిన వారిపై చర్య తీసుకోవాలని, అంత్యోద య కార్డు ఇచ్చి ఆదుకోవాలని.. ఇలా పలు సమస్యలతో ప్రజలు గ్రీవెన్స్‌ సెల్‌కు వచ్చారు. మున్సిపల్‌ ఎన్నికల కోడ్‌ ముగియడంతో ప్రజలు తమ సమస్యలను విన్నవించేందుకు ఎక్కువ సంఖ్యలో సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌ స్టేషన్‌ఘనన్‌పూర్‌ రెవెన్యూ డివిజనల్‌ అధికారి డీఎస్‌. వెంకన్నతో కలిసి 78 దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలు ప్రజావాణిలో అందించిన అర్జీలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అవసరమైతే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్‌ దరఖాస్తులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

చద్దన్నం తింటున్న వృద్ధుడు

గ్రీవెన్స్‌లో భూసమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల సమస్యలే అధికం

ప్రజావాణిలో 78 అర్జీలు

పెండింగ్‌ దరఖాస్తుల

పరిష్కారానికి ప్రాధాన్యం

అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌

చద్దన్నంతో కలెక్టరేట్‌కు..

తమ సమస్యలు, బాధలు కలెక్టర్‌కు చెప్పుకోవాలని దూరప్రాంతాల నుంచి చద్దన్నంతో పలువురు బాధితులు ప్రజావాణికి వచ్చారు. తమ సమస్యలు విన్నవించిన అనంతరం మధ్యాహ్నం వారు తెచ్చుకున్న చద్దన్నం తిని తిరుగు ప్రయాణమయ్యారు.

సమస్యలు తీరేదెన్నడు?1
1/2

సమస్యలు తీరేదెన్నడు?

సమస్యలు తీరేదెన్నడు?2
2/2

సమస్యలు తీరేదెన్నడు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement