గురు రవిదాస్ బోధనలు మార్గదర్శకం
జనగామ: సంత్ శిరోమణి గురు రవిదాస్ మహరాజ్ బోధించిన సమానత్వం, మానవత్వం, కుల, మత భేదాలకు అతీతమైన సమాజ నిర్మాణం అత్యంత అవసరమని సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పల ప్రసాద్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సూర్యాపేటరోడ్డు ఎస్‌పీఆర్ స్కూల్‌లో జరిగిన వేడుకల్లో రవిదాస్ మహారాజ్ 650వ జయంతిని పురస్కరించుకుని ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గురు రవిదాస్ జీవితం సామాజిక న్యాయం, సోదరభావం, సేవాభావానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర మోచి కుల సంఘం పట్టణ వైస్ ప్రెసిడెంట్ చంద్రగిరి శ్రీనివాస్, ట్రెజరర్ సల్లా శివకుమార్, టౌన్ ప్రెసిడెంట్ ప్రభాకర్, కీర్తి వీరేందర్, శోభ, జీవన్ రెడ్డి, మనోజ్, సాయిరాం, అరుంధతి, చంద్ర కళ పాల్గొన్నారు.
శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి
జనగామ రూరల్: విద్యార్థులు పోటీ ప్రపంచంలో ముందుకువెళ్లాలంటే టెక్నాలజీని ఉపయోగించుకుని శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని జిల్లా సైన్స్ అధికారి ఉపేందర్ అన్నారు. సోమవారం ఫిజికల్ సైన్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో మండలంలోని శామీర్‌పేట పాఠశాలలో జిల్లా స్థాయి ఫిజికల్ సైన్స్ పోటీల ముగింపు సమావేశం ఫోరమ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండోజు శ్రీనివాసచారి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సైన్స్ అధికారి పాల్గొని మాట్లాడుతూ శాస్త్ర సాంకేతికలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారన్నారు. అనంతరం గెలుపొందిన వీ.పుష్యమి, కే కావే రి, రిత్విక్‌లకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో డీసీడీఓ గౌసియా బేగం, ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ రెడ్డి, లక్ష్మణ్ జీ, బాల రాజు, తదితరులు పాల్గొన్నారు.
చిల్పూరుగుట్ట
బ్రహ్మోత్సవాలు షురూ
చిల్పూరు: తెలంగాణలో రెండో తిరుపతిగా పేరుగాంచిన చిల్పూరుగుట్ట బుగులు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు తొళక్కమును అడిషనల్ కలెక్టర్ పింకేష్‌కుమార్ జ్యోతి ప్రజ్వళన చేసి ప్రారంభించారు. సాయంత్రం అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజల అనంతరం అడిషనల్ కలెక్టర్‌తో పాటు జిల్లా పరిషత్ సీఈఓ మాధురిషా ఉత్సవాలను ప్రారంభించారు. ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావులు వారిని స్వామి వారి పట్టు వస్త్రాలతో సన్మానించి తీర్థప్రసాదాలను అందించారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ కుర్రెంల మోహన్, ధాత సంగోజు మోహనాచారి, శంకర్‌లక్ష్మి, వీరన్న, మల్లికార్జున్, వసంత, లక్ష్మి, కృష్ణ, హరిఽశంకర్ భక్తులు పాల్గొన్నారు.
గురు రవిదాస్ బోధనలు మార్గదర్శకం
గురు రవిదాస్ బోధనలు మార్గదర్శకం


