బంజారాల అభ్యున్నతికి కృషి
● ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
పాలకుర్తి టౌన్: గిరిజనుల ఆరాధ్య దైవం సంత్‌సేవాలాల్ మహరాజ్ గిరిజన సమాజానికి ఆదర్శమని, ఆయన స్ఫూర్తితోనే ప్రభుత్వం తండాలను అభివృద్ధి చేస్తుందని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా సోమవారం మండల కేంద్రంలోని సేవాలాల్ మందిరంలో భోగ్ బండారో కార్యక్రమాన్ని నిర్వహించారు. గిరిజన మహిళలు సాంప్రదాయ దుస్తులతో రాజీవ్ చౌరస్తాలో ఎమ్మెల్యే, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డితో కలిసి నృత్యం చేశారు. అనంతరం గుడివాడ చౌరస్తా నుంచి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఇందిరా మహిళా శక్తి ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. సమావేశంలో డీఆర్‌డీఓ పీడీ వసంత, తహసీల్దార్ సరస్వతి, అజ్మీర కిష్టునాయక్, తిరుపతిరెడ్డి, లావుడ్యి మంజుల, ధరావత్ సురేష్‌నాయక్, హమ్యనాయక్, రాజేష్‌నాయక్, తదితరులు పాల్గొన్నారు.


