రోడ్డెక్కిన హోర్డింగ్‌లు!
జనగామ: పట్టణంలో ఎక్కడ చూసినా ఎంక్రోచ్‌మెంట్లు, ఫుట్‌పాత్ ఆక్రమణలు, రోడ్లపై ప్రచార హోర్డింగ్‌లతో దారులన్నీ కుదించుకుపోతుంటే మునిసిల్ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. పట్టణంలో కృష్ణకళామందిర్ గల్లీలో షాపింగ్‌మాల్స్, ఆయా దుకాణాల నిర్వాహకులు రోడ్డుపైనే ప్రచార హోర్డింగ్‌ల ఏర్పాటు చేశారు. దారిని ఆక్రమించేస్తూ, బాటసారులు, వాహన చోదకులు వెళ్లే పరిస్థితి లేకుండా ఆర్చీలు, మినీ బోర్డులను రోడ్డుపైనే పెట్టేసి దర్జా వెలగబెడుతున్నారు. నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతూ ఇబ్బందులు ఎదురవుతున్నా పురపాలిక అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొట్టకూటి కోసం చిరు వ్యాపారులు రోడ్డుపై అమ్ముకుంటే జబర్దస్త్ చేసే అధికారులు, రోడ్లపైనే హోర్డింగ్‌లను ఏర్పాటు చేసి దారులన్నీ మూసుకుపోయేలా చేస్తున్న వారిని ఎందుకు వదిలేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
రోడ్డెక్కిన హోర్డింగ్‌లు!


