పన్నులు వందశాతం వసూలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పన్నులు వందశాతం వసూలు చేయాలి

Feb 20 2026 6:40 AM | Updated on Feb 20 2026 6:40 AM

పన్నులు వందశాతం వసూలు చేయాలి

పన్నులు వందశాతం వసూలు చేయాలి

జనగామ: జనగామ పురపాలిక పరిధిలో మార్చి 31వ తేదీ వరకు ఇంటి, నల్లా పన్నులు వందశాతం వసూలు చేయాలని కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి ఆదేశించారు. గురువారం మున్సిపల్‌ కమిషనర్‌ చాంబర్‌లో అన్ని శాఖలతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో 15,818 అసెస్‌మెంట్లు ఉండగా, రూ.6.10కోట్ల మేర డిమాండ్‌ ఉందన్నారు. ఇందులో ఇప్పటివరకు రూ.2.70కోట్లు వసూలు కాగా, ఇంకా రూ.3.45 కోట్లు బాకీ ఉందన్నారు. అలాగే 13,806 నల్లా కనెక్షన్లు ఉండగా, డిమాండ్‌ రూ.2.90కోట్ల మేర వసూలు కావాల్సి ఉందన్నారు. ఇందులో రూ.19.78లక్షల వరకు వసూలు కాగా, ఇంకా రూ.2.70కోట్ల మేర రావాల్సి ఉందన్నారు. సిబ్బంది క్షేత్ర స్థాయిలో ఇంటింటికీ వెళ్లి వచ్చే నెల 31వ తేదీలోపు వందశాతం బాకీలు క్లియరెన్స్‌ చేయాలన్నారు. పట్టణ ప్రజలు సకాలంలో ఇంటి, నల్లా పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలన్నారు.

వచ్చే నెల 31 వరకు డెడ్‌లైన్‌

సమీక్షలో కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement