కొనసాగుతున్న ఇంటర్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న ఇంటర్‌ పరీక్షలు

Feb 28 2026 7:16 AM | Updated on Feb 28 2026 7:16 AM

కొనసాగుతున్న                             ఇంటర్‌ పరీక్షల

కొనసాగుతున్న ఇంటర్‌ పరీక్షల

జనగామ రూరల్‌: జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ఇంటర్‌ విద్యాధికారి కె.జితేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మూడో రోజు మొదటి సంవత్సరం విద్యార్థులకు 16 పరీక్షల కేంద్రాల్లో జరిగాయన్నారు. జిల్లావ్యాప్తంగా మొదటి సంవత్సరం జనరల్‌ 3,227 విద్యార్థులకు 3,187 హాజరు కాగా 40 మంది గైర్హజరయ్యారు. ఒకేషనల్‌లో 1,036 విద్యార్థులకు 956 హాజరు కాగా, 80మంది గైర్హాజరయ్యారు. మొత్తం 97.18 శా తం విద్యార్థులు హాజరయ్యారు. కాగా జిల్లాలో ని పరీక్ష కేంద్రాలను ఆయన సందర్శించారు. డెక్‌ సభ్యులు సునంద, నర్మెట, దేవరుప్పుల కొడకండ్ల పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు.

గీతకార్మికులకు కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ

జనగామ: జిల్లా కేంద్రంలోని వికాస్‌ ఫార్మసీ కళాశాలలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రెవె న్యూ అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌ హాజరయ్యారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. శిక్షణ పొందిన ప్రతీ గీత కార్మికుడు విధిగా రక్షణ కిట్లను ఉపయోగించాలన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. కల్లు గీత కార్మికులందరూ రక్షణ కిట్లను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. అనంతరం 419 మంది కల్లుగీత కార్మికులకు కాటమయ్య కిట్లను అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎన్‌.ఎల్‌.నరసింహ రావు, డీపీఈఓ అనిత, ఏబీసీడీఓ రవీందర్‌, కేజీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి వెంకట మల్లయ్య, ఎకై ్సజ్‌ శాఖ సిబ్బంది, వెనుకబడిన తరగతుల శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

విద్యుత్‌, విత్తన చట్టాలతో రైతాంగానికి ముప్పు

పాలకుర్తి టౌన్‌: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యుత్‌ సవరణ బిల్లులు, విత్తన చట్టాలు రైతాంగ మనుగడకు ముప్పుగా మారుతున్నాయని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.జంగారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలోని శ్రీసోమేశ్వర ఫంక్షన్‌హాల్‌లో జరిగిన జిల్లా మూడో మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.. విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటుపరం చేయడం వల్ల ఉచిత విద్యుత్‌ రద్దయ్యే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు మోకు కనకారెడ్డి మాట్లాడుతూ.. పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ల పనులు వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భుక్య చందనాయక్‌, నాయకులు సింగారపు రమేశ్‌, మదార్‌, మాచర్ల సారయ్య, మిట్యానాయక్‌, బచ్చు శ్రీలత, చిట్యాల సోమన్న, సోమ సత్యం పాల్గొన్నారు.

వచ్చే నెల 25న పోస్టల్‌ డాక్‌ అదాలత్‌

ఖిలా వరంగల్‌: మార్చి 25న పోస్టల్‌ సర్వీసులపై, వినియోగదారుల ఫిర్యాదులపై 53వ ప్రాంతీయ స్థాయి డాక్‌ అదాలత్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించనున్నట్లు వరంగల్‌ తపాలా శాఖ డివిజనల్‌ సూపరింటెండెంట్‌ రవికుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్‌, హనుమకొండ, మహబూబాబాద్‌, జనగామ జిల్లాల పరిధి డివిజన్‌కు సంబంధించి తపాలా సేవల వినియోగదారులకు ఏవైనా ఫిర్యాదులుంటే పోస్టల్‌ ఎన్వలప్‌/కవర్‌పై 53 డాక్‌ అదాలత్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (స్టాఫ్‌ అండ్‌ విజిలెన్స్‌) పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌, హైదరాబాద్‌ రీజియన్‌ హైదరాబాద్‌–500001కి మార్చి 9లోగా చేరేలా పంపించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement