బ్రహ్మోత్సవాలకు ముస్తాబు
స్టేషన్‌ఘన్‌పూర్: డివిజన్‌కేంద్రమైన స్టేషన్‌ఘన్‌పూర్ బస్టాండ్ సమీపంలోని పురాతన తిరుమలనాథస్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ నెల 23 నుంచి మార్చి 4వ తేదీవరకు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతీ రోజూ విశేష పూజలను నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని దేవస్థాన కమిటీ భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసింది. 1న(ఆదివారం) ప్రధాన ఘట్టమైన శ్రీతిరుమలనాథస్వామి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు రామానుజచార్యులు తెలిపారు.


