జనగామ రూరల్: సైబర్ నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని సీఐ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. గురువారం పోలీస్ స్టేషన్‌లో సైబర్ నేరంపై పట్టణానికి చెందిన మహేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌లో ఉండి మొబైల్‌లో బినాన్స్ యాప్ ద్వారా నాలుగు మ్యూల్ అకౌంట్లు సృష్టించి, ఇతరులతో చేతులు కలిపి ఆ అకౌంట్ల ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తూ సైబర్ నేరాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో బయటపడిందన్నారు. సైబర్ నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా నిందితుడు మహేష్ పాత్ర స్పష్టంగా బయటపడినట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ భరత్ పాల్గొన్నారు.


