రేపు కేంద్ర బృందం పర్యటన | - | Sakshi
Sakshi News home page

రేపు కేంద్ర బృందం పర్యటన

Feb 22 2026 8:08 AM | Updated on Feb 22 2026 8:08 AM

రేపు కేంద్ర బృందం పర్యటన

రేపు కేంద్ర బృందం పర్యటన

జనగామ రూరల్‌: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై రేపు (సోమవారం) కేంద్ర బృందం జిల్లా పర్యటించనుందని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా తెలిపారు. శనివారం అదనపు కలెక్టర్‌ పింకేష్‌కుమార్‌తో కలిసి గుగూల్‌ మీట్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 48 కేంద్ర పథకాల అమలును సమగ్రంగా పరిశీలించేందుకు కేంద్ర బృందం పర్యటించనుందని, ఇప్పటివరకు అందించిన పథకాల పురోగతి, పూర్తి వివరాలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులు, రైస్‌ మిల్లర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులను నేరుగా కలుస్తారన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ వసంత, జిల్లా వ్యవసాయ అధికారి అంబిక సోని తదితరులు పాల్గొన్నారు. అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కోదండరాములు ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ట్రాన్స్‌జెండర్స్‌కు ఉపాధి పునరావాస పథకం కింద చెక్కులు పంపణీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement