ప్రాణాలకు రక్షణ కవచం హెల్మెట్
● వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్
రఘునాథపల్లి: ప్రాణాలకు రక్షణ కవచం హెల్మెట్ అని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరి ధరించాలని వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ ద్విచక్ర వాహనదారులకు సూచించారు. మంగళవారం మండలంలోని కోమళ్ల టోల్ ప్లాజా వద్ద నిర్వహించిన ఎరైవ్, ఎలైవ్ కార్యక్రమంలో వాహనదారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.. కార్యక్రమంలో స్టేషన్‌ఘన్‌పూర్ ఏసీపీ భీంశర్మ, జనగామ రూరల్ సీఐ ఎడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై దూదిమెట్ల నరేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


