ద్రావిడ వేద ప్రబంధ పారాయణం
చిల్పూరు: చిల్పూరుగుట్ట బుగులు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం సాయంత్రం అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యులు వేదమంత్రాల నడుమ ద్రావిడ వేద ప్రబంధ పారాయణం భక్తులకు వినిపించారు. ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు–కిరణ్మయి, జూనియర్ అసిస్టెంట్ కుర్రెంల మోహ న్, దాత సంగోజు మోహనాచారి– శంకర్‌లక్ష్మి, వీరన్న, భక్తులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్‌ను కలిసిన ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
పాలకుర్తి టౌన్: మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తొర్రూరు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసున్న సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారిని అభినందించి, గెలుపొందిన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
లెదర్‌పార్కును సందర్శించిన లిడ్‌క్యాప్ ఎండీ
స్టేషన్‌ఘన్‌పూర్: మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉన్న మినీ లెదర్‌పార్కును లిడ్‌క్యాప్ ఎండీ ప్రశాంత్‌కుమార్ మంగళవారం సందర్శించారు. కాగా విషయం తెలుసుకున్న టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చేపూరి వినోద్‌కుమార్, లెదర్‌పార్కు మాస్టర్ ట్రైనర్స్ అక్కడికి చేరుకుని సమస్యలను విన్నవించారు. దళితులకు ఉపాధి కల్పన కోసం ఏర్పాటు చేసిన లెదర్‌పార్కు నిరుపయోగంగా ఉందన్నారు. దీని కోసం పలువురు చైన్నెలో ప్రత్యేక శిక్షణ సైతం తీసుకున్నారని, ఇప్పుడు వారంతా కూలీ పని చేసుకుంటున్నారని వాపోయారు. లెదర్‌పార్కుకు వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు ఎండీకి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు అనంతపురం చంద్రమౌళి, జీడి యాకయ్య, రాజారపు మల్లేష్, మారపాక శ్రీనివాస్, గాదె ఈశ్వరయ్య, జీడి రాంచందర్, కుమారస్వామి, ఏలియా, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
పెంబర్తిని పరిశీలించిన కేంద్ర బృందం
జనగామ రూరల్: గ్రామీణ శ్రేయస్సు, స్థితిస్థాపకత కార్యక్రమంలో భాగంగా కేంద్ర బృందం మంగళవారం వివిధ అంశాలవారీగా జిల్లాలోని క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ఇందులో భాగంగా మండలంలోని ఎల్లంల ఇక్కత్ చేనేత కళాకారులను, పెంబర్తి హస్త కళాకారులను కలిసి ఆయా వృత్తిలో వారి జీవనోపాధి గురించి, ప్రభుత్వ సహకారాలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వివిధ వర్గాల ప్రజలకు ఇస్తున్న రుణ సదుపాయల గురించి, అలాగే పశువుల పెంపకం యూనిట్, విజయ డెయిరీని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో సభ్యులు హర్షద్, సునయ్ కీమ్ అపర్ణ, ఆనంద్ అంకిత్ వివిధ శాఖల అధికారులు విక్రమ్, మూర్తి, శివకృష్ణ, మురళీధర్‌రావు, గోపాల్ మహాజన్ తదితరులు పాల్గొన్నారు.
ద్రావిడ వేద ప్రబంధ పారాయణం
ద్రావిడ వేద ప్రబంధ పారాయణం
ద్రావిడ వేద ప్రబంధ పారాయణం


