విజయోస్తు
జనగామ రూరల్: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు ఈనెల 25 (బుధవా రం) నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 16 సెంటర్లు కేటాయించగా 8 సెంటర్లు జనగామలో, మిగిలినవి 8 ఆయా మండల కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహణ ఉండగా ఉదయం 8.30 వరకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. మొత్తం 8,605మంది హాజరు కానుండగా ఇందులో 4,211 ప్రథమ సంవత్సరం, 4,394 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరం ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
పరీక్ష కేంద్రాల్లో క్లాక్ రూమ్ సౌకర్యం ఉండాలని, ఎట్టి పరిస్థితిలోనూ మొబైల్ ఫోన్‌లను లోపలికి తీసుకుపోకుండా పక్కాగా నిఘా పెట్టాలన్నారు. పరీక్షలు రాసే విద్యార్థుల కోసం ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హాల్‌టికెట్‌పై క్యూర్ కోడ్ ఏర్పాటు చేశారు. కోడ్‌ను స్కాన్ చేస్తే సంబంధిత పరీక్ష కేంద్రాల వివరాలను లొకేషన్ తెలుపుతుందన్నారు. అలాగే పరీక్షల సమయంలో విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి గురైతే.. తట్టుకొని ప్రశాంతంగా పరీక్షలు రాసేవిధంగా టెలిమానస్ నం. 14416 కి ఫోన్ చేస్తే నిపుణులు కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. విద్యార్థులు సమస్యలను నివృత్తి చేసుకొనేందుకు కంట్రోల్ రూమ్ నంబర్ 9550371371 కు ఫోన్ చేయవచ్చన్నారు.
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
జిల్లా వ్యాప్తంగా 8,605 మంది విద్యార్థులు
16 పరీక్ష కేంద్రాలు, క్యూఆర్ కోడ్‌తో లొకేషన్
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు


