చీకటి వెలుగులు పక్కపక్కనే! | - | Sakshi
Sakshi News home page

చీకటి వెలుగులు పక్కపక్కనే!

Mar 3 2026 8:17 AM | Updated on Mar 3 2026 8:17 AM

రఘునాథపల్లి: మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ఓ వైపు వెలుగులు విరజిమ్ముతుంటే, మరోవైపు చిమ్మ చీకట్లోనే వాహనదారులు ప్రయాణించాల్సిన దుస్థితి. మండల కేంద్రంలో ఇరువైపులా ఏర్పాటు చేసిన హైమాస్ట్‌ లైట్లు వారం రోజు లుగా బస్టాండ్‌ నుంచి జనగా మ వైపు వెళ్లే సర్వీస్‌ రోడ్డుపై లైట్లు పనిచేయకపోవడంతో ప్రయాణికులు చీకట్లోనే ప్రయాణిస్తున్నారు. ఈ రహదారి గుండా ప లు గ్రామాల ప్రజలు రైల్వే స్టేషన్‌, ప్రభుత్వ ఆస్పత్రి, స్టేషన్‌ కాలనీకి వెళ్లి వస్తుంటారు. వెలుతురు లేకపోవడంతో రాత్రి వేళల్లో ప్రమాదాలకు గుర య్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల నిర్లక్ష్యంతో సర్వీస్‌ రోడ్డు గుండా చీకట్లోనే ప్రయాణించాల్సి వస్తోందని వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement