కమనీయం.. శ్రీనివాసుడి కల్యాణం | - | Sakshi
Sakshi News home page

కమనీయం.. శ్రీనివాసుడి కల్యాణం

Mar 1 2026 7:57 AM | Updated on Mar 1 2026 7:57 AM

కమనీయ

కమనీయం.. శ్రీనివాసుడి కల్యాణం

చిల్పూరు: చిల్పూరుగుట్ట శ్రీబుగులు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు శనివారం స్వామి వారి కల్యాణ మహోత్సవం అశేష భక్తుల సమక్షంలో గోవింద నామస్మరణల మధ్య కమనీయంగా నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో గుట్టపైనున్న ఆలయం నుంచి కోలాటాల నడుమ పల్లకీలో స్వామి వారిని ఊరేగింపుగా మండపానికి తీసుకువచ్చారు. ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్‌ శ్రీధర్‌రావు, కిరణ్మయి, సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్సై సరిపురం నవీన్‌కుమార్‌, సర్పంచ్‌ నలిమెల అనిత, శాశ్వత దాత సంగోజు మోహనాచారి, శంకరలక్ష్మి తదితరులు తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యులు, ఆరుట్ల రాకేషాచార్యులు వేద మంత్రాల నడుమ వైభవంగా కల్యాణం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.

కళాకారుల వేషధారణ

ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎంపీ కడియం కావ్య

కమనీయం.. శ్రీనివాసుడి కల్యాణం1
1/4

కమనీయం.. శ్రీనివాసుడి కల్యాణం

కమనీయం.. శ్రీనివాసుడి కల్యాణం2
2/4

కమనీయం.. శ్రీనివాసుడి కల్యాణం

కమనీయం.. శ్రీనివాసుడి కల్యాణం3
3/4

కమనీయం.. శ్రీనివాసుడి కల్యాణం

కమనీయం.. శ్రీనివాసుడి కల్యాణం4
4/4

కమనీయం.. శ్రీనివాసుడి కల్యాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement