నేటినుంచి శ్రీతిరుమలనాథ ఆలయ బ్రహ్మోత్సవాలు
స్టేషన్‌ఘన్‌పూర్: డివిజన్ కేంద్రమైన స్టేషన్‌ఘన్‌పూర్ బస్టాండ్ సమీపంలోని శ్రీతిరుమలనాఽథస్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలను ఈనెల 23(సోమవారం) నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు దేవస్థాన చైర్మన్ నీల నర్సింహులుముదిరాజ్, ఆలయ అర్చకులు కలకోట రామానుజచార్యులు తెలిపారు. శ్రీతిరుమలనాఽథస్వామి దేవస్థానంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు.. శ్రీతిరుమలనాథస్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు శాస్త్రోయుక్తంగా వేదపండితులచే నిర్వహించన్నట్లు, స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని మార్చి 1న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఆహ్వానం
శ్రీతిరుమలనాథస్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఆదివారం ఆయన నివాసంలో దేవస్థాన చైర్మన్ నీల నర్సింహులు ఆధ్వర్యంలో ఆహ్వానపత్రం అందించారు. 1న జరిగే స్వామివారి కల్యాణానికి హాజరుకావాలని కోరుతూ ఆహ్వానం పలికారు. మున్సిపాలిటీ చైర్మన్ తాటికొండ వినయ్‌కుమార్, దేవస్థాన డైరెక్టర్లు యాదగిరి, ప్రశాంత్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఆహ్వానించిన దేవస్థాన చైర్మన్


