క్రీడలతో మానసికోల్లాసం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో మానసికోల్లాసం

Feb 27 2026 4:23 AM | Updated on Feb 27 2026 4:23 AM

క్రీడలతో మానసికోల్లాసం

క్రీడలతో మానసికోల్లాసం

జనగామ రూరల్‌: క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక ఉత్సాహం కలుగుతుందని జెడ్పీ సీఈఓ మాధురి షా అన్నారు. కేంద్ర ప్రభుత్వం ‘మేరా యువభారత్‌ వరంగల్‌ కేంద్రం’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి స్పోర్ట్స్‌ మీట్‌ను గురువారం పట్టణంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా సీఈఓ మాట్లాడుతూ..క్రీడలతో ఉన్నత స్థాయిలో నిలబడవచ్చని, ప్రతీ ఒక్కరు క్రీడలపై ఆసక్తి చూపాలని, తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలన్నారు. కబడ్డీ, టగ్‌ ఆఫ్‌ వార్‌లో ఏబీవీ విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ బి.భవాని, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ రాజ్‌కుమార్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ టి.కల్యాణి, ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ కె.రాము, క్రీడాకారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

జెడ్పీ సీఈఓ మాధురిషా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement