స్టేషన్‌ఘన్‌పూర్: పట్టణ కేంద్రంలోని శ్రీతిరుమలనాథస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామివారి తిరువీధియాత్ర, రథోత్సవం, డోపు ఉత్సవం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు కలకోట రంగాచార్యులు ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఆలయంలో స్వామివారికి ప్రధాన పూజలు చేపట్టారు. అనంతరం స్వామివారిని అశ్వవాహనంపై ఉంచి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా రథోత్సవం నిర్వహించారు. తిరువీధియాత్రతో పట్టణకేంద్రంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కార్యక్రమంలో ఘన్‌పూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నీల రాజమ్మగట్టయ్య, దేవస్థాన చైర్మన్ నీల నర్సింహులు, వైస్ చైర్మన్ తాటికొండ యాదగిరి, డైరెక్టర్ గట్టు ప్రశాంత్, కొలిపాక సతీష్, భక్తులు పాల్గొన్నారు.


