పట్టణం.. పోలీస్‌ వలయం | - | Sakshi
Sakshi News home page

పట్టణం.. పోలీస్‌ వలయం

Feb 18 2026 7:22 AM | Updated on Feb 18 2026 7:22 AM

పట్టణ

పట్టణం.. పోలీస్‌ వలయం

జనగామ: జనగామ మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక వాతావరణం రెండో రోజూ బయట ప్రశాంతంగా, కౌంటింగ్‌ హాల్లో ఉద్రిక్తంగా కొనసాగింది. మొదటి రోజు చోటు చేసుకున్న ఉద్రిక్తతలు, ఘర్షణలు దృష్ట్యా పోలీసుశాఖ అప్రమత్తమై భారీ బందోబస్తు చేపట్టింది. డీసీపీ రాజమహేంద్రనాయక్‌ పర్యవేక్షణలో అదనపు బలగాలను జిల్లాకు తరలించి ప్రతి కీలక కేంద్రాన్ని పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు. మున్సిపల్‌ కార్యాలయం, ఆర్టీసీ చౌరస్తా, నెహ్రూ పార్కు, ఆర్‌అండ్‌బీ అతిథి గృహం, హెడ్‌ పోస్ట్‌ఆఫీస్‌, గ్రీయిన్‌ మార్కెట్‌ రోడ్‌, రైల్వే స్టేషన్‌ వంటి ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎంట్రెన్సుల వద్ద బారికేడ్లు, అదనపు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి రాజకీయ నాయకు లుగా అనుమానం ఉన్న ఎవరినీ కూడా లోపలికి అనుమతించలేదు. ఐడీ కార్డు ఉన్నవారిని మాత్రమే హాల్లోకి పంపేలా కఠిన నిబంధనలు అమల్లోకి అమలు చేశారు.

అడుగడుగునా తనిఖీలు

ఉదయం బీఆర్‌ఎస్‌ తరఫున వచ్చిన బస్సును ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్దే డీసీపీ, ఏఎస్పీ పండేరి చేతన్‌ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. అందులో ఉన్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డితో పాటు సభ్యుల భర్తలు, ఇతర కుటుంబ సభ్యులు బస్సు నుంచి దిగిన తర్వాతే కౌన్సిలర్లను లోనికి పంపించారు. అనంతరం ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో వచ్చిన కాంగ్రెస్‌ బస్సును కూడా ఇదే తరహాలో తనిఖీ చేసి కేవలం కౌన్సిలర్లను మాత్రమే హాల్లోకి అనుమతించారు.

ముందస్తు అరెస్ట్‌లు

మండలాల నుంచి పార్టీ కార్యకర్తలు, అభిమానులు పట్టణానికి రాకుండా పోలీసు శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కీలక నేతల్లో కొందరిని ముందుగానే నిర్బంధంలోకి తీసుకోవడంతో ఉద్రిక్తతలు మరింత తగ్గాయి. దీంతో బయట ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అదుపులోకి వచ్చాయి.

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణులపై కఠిన ఆంక్షలు

నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ శ్రేణుల ముందస్తు అరెస్ట్‌

ఓటింగ్‌ హాల్‌ తప్ప,

అంతటా ప్రశాంతం

పట్టణం.. పోలీస్‌ వలయం1
1/1

పట్టణం.. పోలీస్‌ వలయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement