పట్టణాభివృద్ధిపై కలెక్టర్‌తో ఎమ్మెల్యే భేటీ | - | Sakshi
Sakshi News home page

పట్టణాభివృద్ధిపై కలెక్టర్‌తో ఎమ్మెల్యే భేటీ

Mar 3 2026 8:17 AM | Updated on Mar 3 2026 8:17 AM

కౌన్సిలర్లతో కలిసి సమస్యలపై వినతి

జనగామ: జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సందీప్‌ కుమార్‌ ఝాను సోమవారం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కలెక్టర్‌తో పలు అభివృద్ధి పనులు, సమస్యలపై భేటీ అయ్యారు. ఈ భేటీకి జనగామ మున్సిపాలిటీ పరిధిలోని కౌన్సిలర్లు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఎమ్మెల్యే పల్లా ప్రతి కౌన్సిలర్‌ను కలెక్టర్‌కు వ్యక్తిగతంగా పరిచయం చేస్తూ, వార్డు పరిధిలో ఉన్న ముఖ్య సమస్యలను వివరించారు. జనగామ మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ను కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, శానిటేషన్‌, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక దృష్టి సారించాలని కోరామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement