కల్యాణం.. కమనీయం | - | Sakshi
Sakshi News home page

కల్యాణం.. కమనీయం

Mar 4 2026 7:45 AM | Updated on Mar 4 2026 7:45 AM

దేవరుప్పుల : ఏటా హోలీతో ప్రారంభమయ్యే శ్రీ వానకొండ లక్ష్మీనర్సింహ్మస్వామి జాతర పురస్కరించుకొని స్వామివారి కల్యాణమహోత్సవం జరిగింది. మంగళవారం గ్రహణం ఉండడంతో వేదబ్రహ్మణుల సూచనల మేరకు ఉదయం పది గంటలలోపు దేవతమూర్తుల కల్యాణ మహోత్సవం పూర్తి చేసేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలోనే గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో వేసిన కమిటీ సభ్యులు పూర్వపు తంతు మేరకు హనుమాన్‌ ఆలయం నుంచి స్థానిక సర్పంచ్‌ భాషిపాక రాములు దంపతులు తలంబ్రాలు తీసుకొని ముందస్తుగానే గుట్టపైకి చేరారు. కాగా గ్రహణంతో నిర్దిష్ట వేళకు కల్యాణం చేయాలనే పూజారుల సంకల్పంతో గుట్ట ముఖద్వారం(ఆర్చి)వద్ద ప్రత్యేక పూజలచే దేవాదాయ శాఖచే నియమించిన తాత్కాలిక ఆలయ కమిటీ చైర్మన్‌ మాసంపెల్లి భాస్కర్‌, వైస్‌ చైర్మన్‌ కాడవేని శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో తలంబ్రాలతోపాటు పుస్తెమట్టెలు, జిలుకర బెల్లంతో గుట్టపైకి చేరారు. అలాగే పద్మశాలీలు నల్ల ఉపేందర్‌, గుడెల్లి శ్రీనివాస్‌ తదితరులు ఆనవాయితీగా ట్రాక్టర్‌పై మగ్గంనేస్తూ ఆలయం వరకూ చేరుకొని నూతన వస్త్రాలను అందించారు. కాగా ఆలయ పూజారీ బీట్కూరి సంపత్‌కుమారచార్యులు వివాదాలకు తావివ్వకుండా ఇరువురు తలంబ్రాలు స్వీకరించి కల్యాణం పూర్తి చేశారు. దేవాదాయ శాఖ తాత్కాలిక కమిటీ చైర్మన్‌ మాసంపెల్లి భాస్కర్‌ సహకారంతో పూజారులు అన్నప్రసాద వితరణ చేశారు. వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య నేతృత్వంలో పాలకుర్తి సీఐ జానకిరామిరెడ్డి, స్థానిక ఎస్సై ఊర సృజన్‌కుమార్‌ బఽందోబస్తు చేపట్టారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌లు భాషిపాక రాములు, ధారావత్‌ సుజాత, లాకావత్‌ అనిత, టీపీసీసీ సభ్యులు లక్ష్మీనారాయణ నాయక్‌, విజయ డెయిరీ జిల్లా చైర్మన్‌ఽ ధర్మారెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

వైభవంగా శ్రీవానకొండ లక్ష్మీనర్సింహ్మస్వామి వివాహ మహోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement